టాలీవుడ్ ఎనీ ఇండస్ట్రీలో దర్శకతీరుడు రాజమౌళికి తిరుగులేని రికార్డు ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలను టాలీవుడ్ కి పరిచయం చేయడంతో పాటు టాలీవుడ్ సత్తాని ప్రపంచానికి పరిచయం చేశాడు రాజమౌళి. అయితే అంతటి పెద్ద డైరెక్టర్ కి కూడా ఇద్దరు డైరెక్టర్లు అంటే మొదటి నుంచి దడ ఉండేది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ఒక సందర్భంలో పేర్కొన్నారు. ఆ ఇద్దరు కరెక్టుగా కాన్సెంట్రేట్ చేసి మాస్ సినిమా తీయాలే కానీ మనం దుకాణం సర్దేసుకోవాల్సిందే అని ఎప్పుడో రాజమౌళి చెప్పకనే చెప్పాడు.
అప్పుడు రాజమౌళి చెప్పిన మాటలు ఇప్పుడు అక్షర సత్యాలుగా పుష్ప చిత్రం రూపంలో ప్రేక్షకుల ముందు కనిపిస్తున్నాయి. ఒక సందర్భంలో త్రివిక్రమ్ సుకుమార్ తాను భయపడే ఇద్దరు డైరెక్టర్లు అని చెప్పిన రాజమౌళి ఈ ఇద్దరు నిజంగా కాన్సెంట్రేట్ చేసి మాస్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే ఇక జాతరే అని పేర్కొన్నారు. సుకుమార్ మాస్ కంటెంట్ సినిమాలు తీయడంలో దిట్ట.. అయితే అతను పుష్ప చిత్రంతో తన మాస్ ఎలివేషన్ ఓ రేంజ్‌కి పెంచుకున్నాడు.
ఇక ఇప్పుడు పుష్ప 2 చిత్రం తో బాక్సాఫీస్ రికార్డుల చరిత్రను తిరగ రాస్తున్నాడు. నిజానికి సుకుమార్ తను తీసిన రెండవ మూవీ జగడంతోనే మాస్ కంటెంట్ల వైపు తిరిగాడు.. కానీ అది కాస్త డిజాస్టర్ కావడంతో తిరిగి క్లాస్ సినిమాలు చేయడం ప్రారంభించారు. అయితే రామ్ చరణ్ రంగస్థలం మూవీ తర్వాత అతని కెరీర్ ఓ యూ టర్న్ తీసుకుంది. పుష్ప 1 చిత్రంతో అతని మాస్ ఎలివేషన్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు అర్థమైంది.. ఇక పుష్పట్టు తో ఇండియానే షేక్ చేశాడు సుకుమార్.
గతంలో బన్నీ ఒకసారి చెప్పినట్లుగా అసలు సినిమాని ఇలా కూడా తీస్తారా? అనే డౌట్ చూసే వాళ్లకు వచ్చే విధంగా సినిమా హాళ్లలో మాస్ జాతర సృష్టించాడు. మరి ముఖ్యంగా పుష్ప 2 మూవీలో సెకండ్ హాఫ్ ప్రతి ఫ్రేమ్‌లో సుకుమారిచ్చిన హైప్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పుష్ప ను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయమని సలహా ఇచ్చింది రాజమౌళి.. అందుకే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గుర్తింపు లభించింది.