Saturday, July 24, 2021

రజనీ కాంత్ ఆరోగ్య పరిస్థితి పై చిరంజీవి ఆరా..!

హైదరాబాద్ అపోలో లో చికిత్స పొందుతున్న రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుట పడలేదు. హుటాహుటిన చెన్నై నుండి ఆయన వ్యక్తిగత డాక్టర్ హైదరాబాద్ కి వస్తున్నారు. అంత కాక రజనీ కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ చేరుకోనున్నారు. రజనీ కాంత్ బిపి కూడా ఇంకా అదుపులోకి రాలేదు. రేపు కూడా అపోలో లో రజనీకి చికిత్స అందించనున్నారు. రేపు మరి కొన్ని పరీక్షలు చేయాలనీ డాక్టర్ లు చెబుతున్నారు. రజనీ తోనే కుమారి ఐశ్వర్య ఉంది. దీనితో ఐశ్వర్య తో ఫోన్ లో మాట్లాడారు చిరంజీవి. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఒక్క ఐశ్వర్యని మినహాయించి రజనీ వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు డాక్టర్లు.

రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులిటిన్ కూడా విడుదల చేశారు. ఇందులో సారాంశం బట్టి .. ఖచ్చితంగా రజనీకాంత్ కి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలుస్తుంది. ప్రధానంగా బిపి సంబందించిన నిలకడ లేక ఇబ్బందిగా ఉన్నట్లు చెబుతున్నారు. అందువలన రజనీని కలిసేందుకు ఎవరూ రావద్దని చెబుతున్నారు డాక్టర్లు. ప్రస్తుతానికి పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ బిపి విషయంలో మాత్రం కొంత ఆందోళన కరంగా ఉందని తెలుస్తుంది.

Related Articles

Latest Articles