టాలీవుడ్ మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇటీవల మూవీ పై బజ్ పెంచడం కోసం అమెరికాలో డల్లాస్‌లో గేమ్ ఛేంజర్ ఈవెంట్ భారీగా నిర్వచించారు.
అయితే, ఇప్పటి వరకు యూఎస్ మార్కెట్లో గేమ్ ఛేంజర్‌కు అనుకున్న స్థాయిలో ప్రీ బుకింగ్స్ జరగకపోవడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, గేమ్ ఛేంజర్ యూఎస్ ప్రీ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు కేవలం 281,000 డాలర్లు మాత్రమే వసూలు చేసింది. మొత్తం మీద 9,600 టికెట్లు మాత్రమే అమ్ముడైనట్లు సమాచారం. ఇది గతంలో వచ్చిన పుష్ప 2, దేవర, కల్కి 2898 ఏడీ వంటి చిత్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. పైగా చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సోలో మూవీ కావడంతో ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఎక్సపెక్ట్ చేశారు.
2024లో విడుదలకు 15 రోజుల ముందు అత్యధిక ప్రీ బుకింగ్స్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా జూనియర్ ఎన్టీఆర్ దేవర 1.04 మిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో పుష్ప 2 (1 మిలియన్ డాలర్లు), మూడో స్థానంలో కల్కి (873,000 డాలర్లు) ఉన్నాయి. వీటితో పోలిస్తే గేమ్ ఛేంజర్ ప్రీ బుకింగ్స్ లో వెనుకబడింది.
ఓవర్సీస్ కలెక్షన్లు సినిమా విజయానికి ఎంతో కీలకం. డల్లాస్ ఈవెంట్‌తో అక్కడ ప్రమోషన్ చేసినా, ఇప్పటికీ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ కావడం లేదు. నెటిజన్లు, ట్రేడ్ పండితులు కూడా చిత్ర యూనిట్ మరిన్ని కొత్త ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
సంక్రాంతి సీజన్లో విడుదల కానున్న గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాలంటే విదేశీ మార్కెట్లో మంచి హైప్ అవసరం. విడుదలకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో మేకర్స్ త్వరగా అడ్వాన్స్ బుకింగ్స్ పెంచేందుకు చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ మెగాపవర్‌స్టార్ సినిమా ఎలాంటి జోరు చూపిస్తుందో వేచి చూడాల్సి ఉంది.