ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్`. గత కొన్ని సంవత్సరాలుగా వరుస వాయిదా పడుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు జనవరి 10న విడుదల కాబోతోంది. సంక్రాంతి కాంతిగా సందడి చేయబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ రామ్ చరణ్ కెరీర్ కు ఎంతో ముఖ్యం.
మరో కొత్త ఈ సంవత్సరం ఇండియన్ 2 మూవీతో భారీ డిజాస్టర్ చూసిన శంకర్‌కి కూడా ఈ మూవీ హిట్ కావడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు తనపై కోలీవుడ్ లో వస్తున్న అన్ని విమర్శలకు చెక్క పెట్టడానికి శంకర్ ఈ మూవీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే పూర్తి ప్లానింగ్ తో ఈ చిత్రాన్ని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారని టాక్.
మరోపక్క రాంచరణ్ కూడా తన కెరీర్ పై రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలి. తొలి సోలో ఫ్యాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్ తో సక్సెస్ సాధించి తన సత్తా చాటుకోవాలి. అందుకే రీజనల్ తో సహా హిందీ మార్కెట్లో కూడా ఈ మూవీ ఫై బజ్ బాగా క్రియేట్ చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. రామ్ చరణ్ కి సౌత్ తో పాటు నార్త్ లో కూడా మార్కెట్ బాగానే ఉంది.. అలాగే శంకర్ సినిమా కావడంతో తమిళ్ ప్రేక్షకులు సైతం ఎంతో ఎగ్జైట్ మెంట్ ఎదురు చూస్తున్నారు.
అయితే పొంగల్ రేస్ లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, విదామూయార్చి లోకల్ మార్కెట్లో గేమ్ ఛేంజర్ కు గట్టి పోటీ ఇస్తుందని అందరూ ఆశించారు. అయితే ఇప్పుడు ఈ మూవీ కాస్త వాయిదా పడడంతో రామ్ చరణ్ మూవీకి అంత లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆజాద్ విదాముయార్చి పై కాపీ రైట్ ఇష్యూస్ తలెత్తాయి. దీంతో ప్రస్తుతం ఏ మూవీ సంక్రాంతికి విడుదల అవుతుందా లేదా అన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. ఫిలిం ఇండస్ట్రీ ఇన్సైడ్ టాప్ ప్రకారం కచ్చితంగా ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది.
ఇదే గనుక జరిగితే `గేమ్ చేంజర్` కు అక్కడ మార్కెట్ పరంగా లక్కీ ఛాన్స్ అనడంలో డౌట్ లేదు.