![Screenshot_20250216-205116_Facebook](https://apmessenger.com/wp-content/uploads/2025/02/Screenshot_20250216-205116_Facebook-1024x638.jpg)
రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘RC 16’ సినిమా షూటింగ్ ప్రస్తుతం తాత్కాలికంగా బ్రేక్ లో ఉంది. రెండు షెడ్యూళ్లను పూర్తిచేసిన అనంతరం, చరణ్ తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లాడు. ఉపాసన, క్లింకార తో విదేశాల్లో సమయం గడుపుతున్న చరణ్ త్వరలో తిరిగి షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. అయితే ఈ వెకేషన్ ఎంతకాలం కొనసాగుతుందనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు.
ఇదిలా ఉండగా, దర్శకుడు బుచ్చిబాబు త్వరలో ప్రారంభించబోయే కొత్త షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నాడు. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్ – జాన్వీ కపూర్ పై కొన్ని ప్రత్యేకమైన రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలు చాలా రియలిస్టిక్ గా ఉండబోతున్నాయని, కథలో కు సెట్ అయ్యే విధంగా వాటిని అందంగా తెరకెక్కించేందుకు బుచ్చి బాబు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది.
టాలీవుడ్ లో ఇప్పటి వరకు జాన్వీ కపూర్ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించలేదు. ఆమె తొలి తెలుగు సినిమా ‘దేవర’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా నటించినా, ఆ కాంబినేషన్ లో ప్రత్యేకమైన రొమాంటిక్ సీన్స్ లేకపోవడం గమనార్హం. ఆమె పాత్రలో స్కిన్ షో మాత్రమే ఉండగా, ఎన్టీఆర్ తో రొమాన్స్ కి ఎక్కువ అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RC 16’లో రామ్ చరణ్ తో జాన్వీ కపూర్ కి అలాంటి ఛాన్స్ దక్కింది.
బుచ్చిబాబు రొమాంటిక్ సన్నివేశాలను బాగా హ్యాండిల్ చేయగలడనే విషయం ఉప్పెన మూవీ తో ప్రూవ్ అయింది . ఆ సినిమాలో వైష్ణవ్ తేజ్-కృతిశెట్టి మధ్య ఉన్న రొమాంటిక్ సీన్స్ కి ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. థియేటర్లలో ఫ్యాన్స్ విజిల్స్ వేసిన సందర్భాలు కూడా చూశాం. ఇదే కౌశలాన్ని బుచ్చిబాబు ‘RC 16’లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్ కి కూడా ఉపయోగించనున్నాడని అంటున్నారు.
ఇప్పటికే ‘RC 16’ తొలి షెడ్యూల్ లో చరణ్-జాన్వీ కపూర్ కలిసి కొన్ని సన్నివేశాల్లో నటించారు. ఆ తర్వాత జాన్వీ బాలీవుడ్ సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయింది. అయితే, తాజా షెడ్యూల్ లో ఆమె తిరిగి షూటింగ్ లో పాల్గొననుంది. రామ్ చరణ్ – జాన్వీ కపూర్ రొమాంటిక్ సన్నివేశాలు తెరపై కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. ఈ ఇద్దరి కాంబినేషన్ పై అభిమానుల అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. ఇక, బుచ్చిబాబు మాస్, ఎమోషన్, రొమాన్స్ మేళవించి ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తే, ‘RC 16’ మరో భారీ హిట్ అవ్వడం ఖాయమని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.