రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ విడుదలై టాలీవుడ్లో సంచలనంగా మారింది. ట్రైలర్ విడుదలతో ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా, ట్రైలర్‌ను టాలీవుడ్ జక్కన్న రాజమౌళి విడుదల చేయడం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. విడుదలైన కొద్దిసేపట్లోనే ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్‌తో దూసుకెళ్లింది.
సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో ఒకేసారి విడుదలైన విషయం తెలిసిందే. యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లపై ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ విపరీతమైన స్పందనను అందుకుంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 180 మిలియన్ వ్యూస్ సాధించి ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. ఈ స్థాయిలో ట్రైలర్‌కి వచ్చిన వ్యూస్ ఇటీవల ఏ చిత్రానికీ రాలేదని మేకర్స్ ప్రకటించారు. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కి మరింత ఆకర్షణను కలిగిఅందుకుంది.
ట్రైలర్లో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా చరణ్ లుంగీ కట్టుతో కనిపించిన మాస్ లుక్ భారీగా ఆకట్టుకుంటోంది. స్లో మోషన్ షాట్స్ చూసి అభిమానులు థ్రిల్ ఫీలవుతున్నారు. ట్రైలర్లో చూపించినట్లు ఈ సినిమా ఒక పవర్ఫుల్ మెసేజ్‌తో పాటు రామ్ చరణ్ నటనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు అందించబోతోందని అర్థమవుతోంది.
చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా, అంజలి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా తమిళ స్టార్ ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటించడం సినిమాపై అంచనాలను పెంచింది. శంకర్ సారథ్యంలో వచ్చిన ఈ తో రామ్ చరణ్ క్రేజ్ విపరీతంగా పెరుగుతుందని అతని అభిమానులు ఆశిస్తున్నారు.‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ నటించిన సోలో చిత్రం ఇదే కావడం విశేషం. నాలుగేళ్ల క్రితం విడుదలైన వినయ విధేయ రామ చిత్రం విఫలమవడంతో రామ్ చరణ్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.
సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న ‘గేమ్ ఛేంజర్’ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ట్రైలర్ విడుదలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. పవర్ఫుల్ కథ, శంకర్ మాస్ టచ్, థమన్ సంగీతం, రామ్ చరణ్ ఆకట్టుకునే లుక్స్ అన్నీ ఈ సినిమాను ఘనవిజయం దిశగా నడిపిస్తాయని అభిమానులు విశ్వసిస్తున్నారు.