గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘పుష్ప 2’తో భారీ విజయాన్ని సాధించిన సుకుమార్, రామ్ చరణ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. వర్కింగ్ టైటిల్‌గా ‘RC 17’ అనే పేరుతో రూపొందనున్న ఈ చిత్రం ప్రారంభం అయ్యేందుకు ఇంకా ఏడాది సమయం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవల రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘RC 16’ చిత్రంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . అదే సమయంలో, శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా 2025 సంక్రాంతి సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ కోసం మెగా అభిమానుల ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
డల్లాస్‌లో జరిగిన ఈవెంట్‌లో మాట్లాడిన సుకుమార్, ‘గేమ్ చేంజర్’ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఈ చిత్రాన్ని ఇప్పటికే చూసిన సుకుమార్, సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంటుందని, ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుందని అన్నారు. సెకండ్ హాఫ్ మరింత ఉత్కంఠగా ఉంటుందని, ముఖ్యంగా క్లైమాక్స్‌లో రామ్ చరణ్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అందించారని ప్రశంసించారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్, పొలిటికల్ లీడర్‌గా రెండు విభిన్న పాత్రలు పోషించారు. తండ్రీకొడుకులుగా ఉన్న ఈ పాత్రలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని టాక్. ఈ మూవీ లో ఎస్. జె. సూర్య ప్రతినాయకుడిగా, కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటించారు.
మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెరకెక్కించడంతోపాటు సామాజికమైనటువంటి ఓ సందేశాన్ని అందించే విధంగా కథను ముందుకు నడిపించడంలో డైరెక్టర్ శంకర్ సిద్ధహస్తుడు. అతని డైరెక్షన్లో తెరకెక్కి ‘జెంటిల్మన్’, ‘ఒకే ఒక్కడు’ వంటి చిత్రాల తర్వాత అదే టైప్లో తిరిగి ఆయన నుంచి వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.