గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంక్రాంతి పండక్కి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజెస్ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మరోపక్క బుచ్చి బాబు దర్శకత్వంలో ఒక ప్రతిష్టాత్మక చిత్రాన్ని చేస్తున్నారు. ‘RC 16’గా పిలుస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెండవ షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని బుచ్చి బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో సినిమా సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నారు. సుకుమార్ ఇటీవల రూపొందించిన ‘పుష్ప 2’ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. చరణ్ – సుకుమార్ కాంబినేషన్ అంటే మెగా ఫ్యాన్స్‌కు ప్రత్యేక ఆకర్షణ. ఎందుకంటే గతంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా చరణ్ నటనకు కొత్త డైమెన్షన్‌ను తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత చరణ్ కెరీర్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంది.
ఆ విశేషం పక్కన పెడితే, ‘RC 16’ సినిమాకి సుకుమార్ కూడా బ్యాక్ ఎండ్‌లో సపోర్ట్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బుచ్చి బాబు, సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన మొదటి సినిమా ‘ఉప్పెన’ కూడా సుకుమార్ సపోర్ట్ తోనే రూపొందింది. ఇప్పుడు రామ్ చరణ్‌తో బుచ్చి బాబు చేస్తున్న సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది. అలాంటి భారీ ప్రాజెక్ట్‌ను బుచ్చి బాబు హ్యాండిల్ చేస్తుండటంతో సుకుమార్ కూడా ఈ చిత్రానికి సలహాలు ఇస్తున్నారట.
దీంతో ‘RC 16, RC 17’ అనే రెండు సినిమాల్లోనూ సుకుమార్ ప్రెజెన్స్ ఉందని చెప్పొచ్చు. రామ్ చరణ్ నటనకు రంగస్థలం సినిమాలో ఒక కొత్త కోణం చూపించిన సుకుమార్, ఇప్పుడు వచ్చే సినిమాలను మరింత ప్రాముఖ్యంతో రూపొందించనున్నారు. ‘RC 16’ ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుండగా, ‘RC 17’ సినిమాను సుకుమార్ అత్యున్నత స్థాయిలో తీసుకురానున్నారు.
ఇవే కాకుండా, రామ్ చరణ్ ‘RRR’లో చూపించిన ప్రతిభతో తనపై అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రాబోయే ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు మరో మాస్ ట్రీట్ అందించనున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత చరణ్ కెరీర్ మరింత ఎత్తుకు చేరుతుందని అంచనా వేయవచ్చు. ఈ రెండు సినిమాలు మెగా ఫ్యాన్స్‌కు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి.