టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన ”పుష్ప 2” దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కేవలం రెండు వారాల్లో ₹1650 కోట్లు వసూలు చేసి, తెలుగు సినిమా పరాక్రమాన్ని మరోసారి ప్రపంచానికి చాటించింది. ఇందులో ముఖ్యంగా ”జాతర సీక్వెన్స్” ప్రేక్షకులను థియేటర్లలో పూనకాలతో ఊగిపోయేలా చేసింది. అల్లు అర్జున్ నటనకు, సుకుమార్ డైరెక్షన్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. కానీ, సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటన యూనిట్ ఆనందాన్ని కొంతమేర దెబ్బతీసింది.
ఇదిలా ఉంటే, ఇటీవల పుష్ప 2 హీరోయిన్ రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా ‘జాతర సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ చీర కట్టుకొని నటించిన తీరును ప్రశంసిస్తూ, ఒక మగాడు 21 నిమిషాలపాటు చీరలో నటించడం అంటే మామూలు విషయం కాదు. డ్యాన్స్ చేయడం, ఫైట్ చేయడం, డైలాగులు చెప్పడం చేయాలి అంటే చాలా దైర్యం కావాలి అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, కొంతమంది నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. “సూపర్ డీలక్స్”లో విజయ్ సేతుపతి, “కాంచన”లో శరత్ కుమార్, “భామనే సత్యభామనే”లో కమల్ హాసన్ వంటి స్టార్స్ లేడీ గెటప్స్‌లో అద్భుతంగా నటించారని, వాటిని రష్మిక చూసిందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదంపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె చేసిన ఈ కామెంట్స్ మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
అయితే పుష్ప లో శ్రీవల్లి పాత్ర లో రష్మిక నటనకు మాత్రం సౌత్,నార్త్ తేడా లేకుండా అందరూ ఫిదా అయిపోయారు. ఈ మూవీ తర్వాత రష్మిక లైన్ అప్ లో యానిమల్ పార్క్, చావా,కుబేర లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకటిగా మారిన రష్మిక తన రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచే ఛాన్స్ ఉంది అని టాక్.