సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన అతి తక్కువ కాలంలో నేషనల్ క్రష్ గా.. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న నటి రష్మిక మందన్న.. సౌత్ ఇండస్ట్రీ తో పాటు నార్త్ లో కూడా ఇప్పుడు బిజీ అవుతున్న ఈ భామ మరో రెండు రోజుల్లో పుష్ప 2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. కన్నడ మూవీ తో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పుడు అన్ని ఇండ స్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ భామకు సంబంధించి ఓ చిన్న సెంటిమెంట్ తాజాగా వైరల్ అవుతుంది.
శ్రీవల్లి 2.0 గా ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్న ఈ బ్యూటీ ఈసారి కచ్చితంగా నేషనల్ అవార్డు అందుకుంటుంది అన్న ధీమాతో ఉన్నారు ఆమె అభిమానులు. ఇప్పటికే పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్న టాక్ భారీగా వినిపిస్తోంది.. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల రష్మిక సక్సెస్ కు సూపర్ సెంటిమెంట్ అన్న ఒక వార్త మరింత వైరల్ అవుతుంది.
డిసెంబర్ నెలలో విడుదల కాబోతున్న పుష్ప 2కు రష్మిక సెంటిమెంట్ కూడా ఆడ్ అయితే ఇక రికార్డులు బద్దలవ్వాల్సిందే అంటున్నారు ఆమె ఫ్యాన్స్. రష్మిక కెరీర్ పరంగా తీసుకుంటే డిసెంబర్ నెల ఆమెకు బాగా కలిసి వస్తుంది అనడంలో సందేహం లేదు. సినీ ఇండస్ట్రీలో డబ్ల్యూ ఇచ్చిన కిర్రాక్ పార్టీ చిత్రం డిసెంబర్ నెలలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
కన్నడలో రష్మిక చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్ అంజనీపుత్ర, చమక్ సినిమాలు కూడా డిసెంబర్లోనే విడుదలయ్యాయి. ఇక డిసెంబర్ నెలలో వచ్చిన పుష్ప 1 రష్మికకు ఎలాంటి హిట్ తెచ్చిందో అందరికీ తెలుసు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీలో బాలీవుడ్ లో భారీ సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు తనకు బాగా కలిసి వచ్చిన డిసెంబర్ నెలలో మరొకసారి పుష్ప 2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా రష్మిక లక్కీ మంత్ ఆమెకు మంచి సక్సెస్ అందిస్తుంది అని అందరూ భావిస్తున్నారు. మరి రష్మికకు డిసెంబర్ సెంటిమెంట్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.