నేషనల్ క్రష్ రష్మిక సూపర్ ఫామ్ లో దూసుకుపోతోంది. ఈ సంవత్సరం ఆమె నటించిన సినిమాలు వరుస విజయాలు అందుకోవడంతో అమ్మడి రేంజ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది. మొన్నటి వరకు కేవలం సౌత్ ఇండస్ట్రీ కే పరిమితమైన ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్ లో కూడా హల్చల్ చేస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీస్ సక్సెస్ తర్వాత.. ఇప్పుడు పుష్ప 2 చిత్రంతో నార్త్ ఆడియన్స్ మనసు దోచుకుంది ఈ బ్యూటీ.
వచ్చే ఏడాది వర్ష సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక జోష్ చూస్తుంటే మిగిలిన టాలీవుడ్ హీరోయిన్ల హోష్ పోతోంది. సంవత్సరానికి ఒక్క సినిమా చేయడం.. లేదా ఒక్క హిట్ సాధించడం గగనం అయిపోతున్న ఈ రోజులలో స్టార్ హీరోలకు దీటుగా వరుసహిట్లతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. అయినా కాస్త కూడా రిలాక్స్ అవ్వకుండా నెక్స్ట్ సినిమాల లైనప్ తో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది.
నిన్నగాక మొన్న పుష్ప విడుదల అయితే.. ఇక ఇప్పుడు 9న రష్మిక నటిస్తున్న నెక్స్ట్ మూవీ టీజర్ రాబోతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ.. టీజర్ డిసెంబర్ 9న రాబోతోంది. పుష్పకి సంబంధించిన ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ మూవీ గురించి చెప్పడం గమనార్హం. ప్రస్తుతం రష్మికా కి ఉన్న క్రేజ్ తో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ హిట్ కొట్టడం పెద్ద విషయమేమీ కాదు అంటున్నారు విశ్లేషకులు.
ఇక ఈ మూవీ తో పాటు ధనుష్ కుబేర, విక్కీ కౌశల్ చావా ఉండనే ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లో సికందర్ మూవీ లో కూడా ఈ బ్యూటీ ఛాన్స్ దక్కించుకుంది. యానిమల్ పార్క్, పుష్ప 3 లాంటి సీక్వెల్స్ తో పాటు సాలిడ్ చిత్రాలు కూడా ఈ భామ లిస్టులో ఉన్నట్లు టాక్. దీంతో వచ్చే ఏడాది ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రష్మిక ఫుల్లు వైరల్ అవుతుంది.