Wednesday, September 22, 2021

చంద్రబాబుకు చెప్పి నేనే హోం మినిస్ట్రీ తీసుకుంటా.. మిమ్మల్ని ఎక్కడున్నా వదలను

పాపం పోలీసుల పరిస్థితి ఎప్పుడూ అడకత్తెరలో పోక చెక్కలాంటిదే. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా అటు అధికార పార్టీకి, ఇటు ప్రతి పక్షాలకు మధ్య నలిగి పోతుంటారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ట్రాన్స్‌ఫర్ల‌ు, పనిష్‌మెంట్‌లతో సతమతమవుతుంటారు. తాజాగా ఈరోజు ప్రతిపక్ష టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు పోలీసులపై తీవ్ర స్థ్రాయిలో విరుచుకుపడ్డారు.

పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో సోమవారం అచ్చెన్న వైసీపీ అభ్యర్థులను బెదిరించారనేది అభియోగం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈరోజు అచ్చెన్నను ఆయన నివాసంలో అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులను తీవ్ర స్థాయిలో బెదిరించారు అచ్చెన్న. ‘‘ఈరోజు మేము అధికారంలో లేక పోవచ్చు. రేపు అధికారంలోకి వచ్చేది మా పార్టీనే.

చంద్రబాబు గారికి చెప్పి హోంమంత్రి పదవి నేనే తీసుకుంటా. మీరు ఎక్కడున్నా వదిలి పెట్టను. నా బెడ్‌రూం లోకి మీరు ఎలా వస్తారు. నోటీసు ఇచ్చి ఉంటే నేనే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఉండేవాడిని. నేనేమి చట్టాన్ని గౌరవించని వ్యక్తిని కాదు. ఖాకీ డ్రస్‌ను చూస్తుంటే సిగ్గేస్తోంది. నాకే కాదు ఖాకీ డ్రస్‌ వేసుకునే తోటి ప్రభుత్వ ఉద్యోగుల కూడా మిమ్మల్ని చూసి సిగ్గు పడుతున్నారు. మీరు న్యాయ బద్ధంగా, చట్ట బద్ధంగా పనిచేయడం నేర్చుకోండి. ప్రభుత్వాకు తొత్తులుగా మారమాకండి’’ అని హెచ్చరించారు. దీంతో పోలీసులు కొద్ది సేపు సంయమనం పాటించి అచ్చెన్నను అరెస్ట్‌ చేసి తీసుకు వెళ్లారు.

Latest Articles