‘సైరా’ కొంప ముంచింది అతడే..!

0
4337

‘సైరా నరసింహారెడ్డి’ ది మంచి కథ.. దేశాన్ని ఆక్రమించిన తెల్లవాళ్ళని బడతంలో ప్రాణాలు సైతం లెక్కచేయని ఒక వీరుడి కథ. తెల్ల వాడి తల నరికి తెల్లవాడికే పార్సెల్ పంపించిన భారత మాత ముద్దు బిడ్డ కథ. పోరాటం కోసం తన ప్రాణాలు వదిలినా.. బ్రిటీష్ వాళ్ళు ఈ వీరుడి తలను 30 ఏళ్ళు కోటకు వేలాడదీశారు అంటే.. ఆ వీరుడు బ్రిటీష్ వాళ్ళ గుండెల్లో ఎన్నాళ్ళు రైళ్లు పరిగెత్తించి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి వీరుడి కథని తీసుకొని ఒక రాజమౌళి నో, మరొక సీనియర్ డైరెక్టరో తీసి ఉంటే.. బాహుబలి కి బాబు లాంటి కలెక్షన్ లు వచ్చేవి. కానీ.. రామ్ చరణ్ తీసుకుని వెళ్లి ఈ సినిమాని అంతగా గొప్ప సినిమాలు తీయని సురేందర్ రెడ్డి చేతిలో పెట్టాడు. అదే ఇప్పుడు సైరా కొంప ముంచింది. సినిమా ఒక సీరియల్ గా సాగి.. అక్కడక్కడా కొంచం లేపుతూ, మళ్ళీ సీరియల్ లాగా కొనసాగింది.

అయితే బ్రిటీష్ వాళ్ళు తల నరికితే ఎవరికైనా రక్తం ఉప్పొంగుతుంది. అలానే ఈ సినిమా చూసే సమయంలో బ్రిటీష్ వాళ్ళు తల నరికితే సగటు ప్రేక్షకుడికి రక్తం ఉప్పొంగుతుంది. అంతే కానీ.. సినిమా తీసే విధానాన్ని బట్టి ప్రేక్షకుడికి రక్తం ఉప్పొంగలేదు. ఒక్క క్యేరెక్టర్ లో బలం లేదు. కనీసం బాహుబలి సినిమాలో కట్టప్పకి వచ్చిన క్రేజ్ కూడా చిరంజీవికి తెప్పించలేక పోయాడు సురేందర్ రెడ్డి. దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున, భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించే సమయంలో డైరెక్టర్ ఎంపిక అనేది ఎంతో ముఖ్యం. రామ్ చరణ్ అక్కడే పప్పులో కాలు వేసాడు. దాని ప్రతిఫలమే ఇప్పుడు కలెక్షన్ లు.

ఇక కలెక్షన్ ల విషయానికి వస్తే 13 వ రోజు ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ కేవలం ఒకటిన్నర కోటి మాత్రమే. అతి త్వరలో ఈ సినిమా కలెక్షన్ ముగిసేలా కనిపిస్తుంది. ఎంతకాదనుకున్నా ఫుల్ రన్లో 70 నుండి 100 కోట్ల నష్టాలు వస్తాయని సినీ క్రిటిక్స్ భావిస్తున్నారు. ఇప్పటికే బయ్యర్లు ఎంతో ఆందోళనతో ఉన్నారు. సైరా కి వచ్చిన నష్టాలు దర్శకుడు కొరటాల శివ తో చేస్తున్న తరువాతి సినిమాతో తీర్చాలని చిరు, చరణ్ లు భావిస్తున్నారట.