తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని విజయపదం వైపు నడిపించి, ఆ పార్టీ ని అధికారం లోకి తెచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు.
ఒకవిధంగా చెప్పాలంటే ప్రత్యర్థులు రేవంత్ దూకుడుకి హడలి పోతున్నారు అనే చెప్పాలి. అయితే ఎన్నో సవాళ్ళను ఎగురుకుంటూ ముందుకు పోతున్న సీఎం రేవంత్ రెడ్డి, సంక్రాంతి లోపు నామినేటేడ్ పోస్టులను మొత్తం భర్తీ చేస్తామని చెప్పుకొచ్చాడు.
అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పట్ల అంకిత భావం తో పని చేసి ఎమ్యెల్యే టికెట్స్ దక్కని వాళ్ళకి ఈ నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతున్నట్టు సమాచారం.
అంతే కాకుండా ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారికి సామజిక వర్గాలను, వారి గత చరిత్ర ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు టాక్. అయితే ఇక్కడే అసలు చిక్కు ఉంది.
అందరినీ సంతృప్తి ఒకేసారి పర్చలేము, కొన్ని సార్లు డిమాండ్ కి తగ్గట్టుగా, ప్రజాధారణ ని బేస్ చేసుకొని కూడా నామినేటెడ్ పదవులను కేటాయించాల్సి ఉంటుంది.
వివిధ రూపాల్లో 100 కి పైగా ఈ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఆశావహులకు పదవి దక్కనప్పుడు ఇతర పార్టీలకు మారే ప్రమాదం కూడా ఉంది.
మరి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళను ఎలా సంతృప్తి పరుస్తాడో చూడాలి. అసలే ఎంపీ ఎన్నికలు ముంచుకువస్తున్నాయి, ఈ సమయం లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చెయ్యడం సరికాదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి కి సూచిస్తున్నారు.
కానీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎవరీ మాట వినే పరిస్థితిలో లేరు. ఈ సవాలు ఎదురుకోవడానికే ఆయన సిద్దమయ్యాడు. అయితే 2014 నుండి ఇప్పటి వరకు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి ఎలాంటి పదవులు పొందని వారికే ఈసారి రేవంత్ రెడ్డి పెద్ద పీట వెయ్యబోతున్నాడట, చూడాలి మరి.