టాలీవుడ్ లో ఎక్కడ ఏం జరిగినా.. ప్రతి విషయంపై స్పందిస్తూ గురివిందకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో సెన్సేషన్ గా మారిన అల్లు అర్జున్ అరెస్టుపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడడం మొదలుపెడితే వరుసగా ట్వీట్ ల మీద ట్వీట్లు వదిలే రాంగోపాల్ వర్మ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కూడా ఓ ట్వీట్ పెట్టారు. అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి మధ్య ఇదే కామన్ పాయింట్ అంటూ వర్మ పెట్టిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం రేవంత సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. తనదైన సెటైరికల్ స్టైల్ లో వర్మ ట్వీట్లు వదులుతూనే ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు గిఫ్టులు, రిటర్న్ గిఫ్టులు అంటూ అంటూ మాట్లాడిన ఆర్జీవి.. ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ కు.. అల్లు అర్జున్ అరెస్ట్ కు మధ్య ఉన్న కామన్ పాయింట్ అంటూ ఓ సరికొత్త పాయింట్ లేవనెత్తాడు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయించిన విషయం సంచలనగా మారింది. అరెస్టుతో రేవంత్ కి ప్రజలలో ఓ రేంజ్ లో మైలేజ్ పెరిగింది. ఇక ఆర్జీవి రెండు అరెస్టులలో చెప్తున్న కామన్ పాయింట్ ఒక్కటే..అటు రేవంత్ రెడ్డి అరెస్టు.. ఇటు అల్లు అర్జున్ అరెస్టు జరిగిన ప్రదేశాలు ఒకటే కావడం. అప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు నేరుగా ఆయన బెడ్ రూమ్ తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టు చేశారు. ఆ సమయంలో అదే రూంలో ఆయన కుమార్తె, భార్య కూడా ఉన్నారు.
ఇక ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా పోలీసులు ఇంచుమించు అలాగే చేశారు. కనీసం అల్లు అర్జున్‌కి బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా బెడ్ రూమ్ వరకు వెళ్లి అరెస్టు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని తిరిగి అందరికీ గుర్తుచేసిన ఆర్జీవి.. ఈ అరెస్టు కారణంగా అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగిందని.. పుష్ప 2 కలెక్షన్స్ కూడా విపరీతంగా పెరిగాయని.. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అంటూ పెట్టిన ట్వీట్ చర్చనీయాశంగా మారింది.