![Screenshot_20250214-175938_Facebook](https://apmessenger.com/wp-content/uploads/2025/02/Screenshot_20250214-175938_Facebook-1024x661.jpg)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఆయన సినిమాలు, సెలబ్రిటీల పై వ్యాఖ్యలు, రాజకీయాల గురించి తనదైన శైలిలో మాట్లాడటం అందరికీ తెలిసిందే. అద్భుతమైన సినిమాలు తీసిన వర్మ ఇటీవల కాలంలో మాత్రం అసభ్యకరమైన సన్నివేశాలతో సినిమాలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే, సత్య రీ-రిలీజ్ సందర్భంగా “నేను మారిపోయాను” అంటూ చెప్పాడు. ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, తన కొత్త సినిమా “సిండికేట్” ప్రకటించాడు.
వర్మ సినిమాల సంగతి పక్కన పెడితే, ఆయనకు మెగా ఫ్యామిలీలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే నచ్చుతాడు. ఈ విషయాన్ని ఆయన గతంలో ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పాడు. అల్లు అర్జున్ నిజమైన మెగాస్టార్ అంటూ అనేక సందర్భాల్లో ట్వీట్లు చేశాడు. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ గురించి తనదైన శైలిలో స్పందించాడు. “నేను పుష్ప 2ని చాలా ఇష్టపడ్డాను, కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ చూసాక అల్లు అర్జున్, సుకుమార్ కాళ్ల మీద పడాలనిపిస్తోంది” అంటూ వ్యాఖ్యానించాడు.
ఇటీవల బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన సందర్భంలో వర్మ , పుష్ప సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. “ఒక ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ పేరు చెప్పలేను కానీ, పుష్ప సినిమా మొదట్లో వచ్చినప్పుడు అతను ‘అల్లు అర్జున్ ముఖం చూసి నార్త్ ప్రేక్షకులు వాంతులు చేసుకుంటారు’ అని అన్నాడట. కానీ ఇప్పుడు అదే వ్యక్తి పుష్ప 2 చూసి పీడకలలు పడుతున్నాడు. బాంద్రాలో తిరిగే వాళ్లు ఎప్పటికీ పుష్ప లాంటి సినిమా తీయలేరు” అంటూ బన్నీ చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ బాలీవుడ్ మార్కెట్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నార్త్ ప్రొడ్యూసర్లు హీరోలంటే సిక్స్ ప్యాక్ ఉండాలి, అందంగా కనిపించాలి అనే భావనలో ఉంటారు. కానీ సౌత్ డైరెక్టర్లు అలా కాదు. వారికి మంచి ఇంగ్లీష్ రాదేమో కానీ, ప్రేక్షకుల నాడిని అర్థం చేసుకుంటారు. బాలీవుడ్ దర్శకులకు మాస్ సినిమాలు తీయడం అసాధ్యం. కంటెంట్ ఉంటే ఏ భాషలోనైనా ప్రేక్షకులు సినిమాను చూస్తారు. స్టార్ హీరోలు ఎప్పుడూ స్టార్లులానే కనిపించాలి. కథ ఎంత మంచిదైనా, వారు తమ స్టార్ ఇమేజ్ ను కోల్పోతే ప్రేక్షకులు డిస్‌కనెక్ట్ అవుతారు” అని వ్యాఖ్యానించాడు.
ఈ వ్యాఖ్యలు సినీ ప్రియుల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. నిజానికి, పుష్ప సినిమా విడుదలకు ముందు అల్లు అర్జున్‌కు బాలీవుడ్‌లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ, ఆ సినిమా విపరీతమైన విజయాన్ని సాధించి, బన్నీకి హిందీలో కొత్త గుర్తింపు తీసుకువచ్చింది. ఇప్పుడీ క్రేజ్ పుష్ప 2ను మరింత భారీ స్థాయికి తీసుకెళ్లింది. ఈ హవా కొనసాగిస్తే, బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలవుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బన్నీ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీపై దృష్టి పెట్టినట్లు టాక్ నడుస్తోంది. ఆయన త్వరలో ఒక హిందీ సినిమాతో రావచ్చని, కానీ ఆ సినిమా ఏది? దర్శకుడు ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా, పుష్ప సిరీస్ బన్నీని నార్త్ ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.