ఆంధ్రప్రదేశ్లో 700 కోట్ల భూస్కాంలో ప్రతి రోజూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక పాత్రధారులుగా భావిస్తున్న పలువురు పేర్లు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ నుంచి ఏసీబీ అధికారులకు కీలక సమాచారం లభించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో రీతూ చౌదరి ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
సింగ్ను ఏసీబీ కస్టడీలో ప్రశ్నిస్తున్నప్పుడు, జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి వెల్లడించినట్టు సమాచారం. సింగ్, తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పిస్తానని ధృడంగా పేర్కొన్నాడు. అలాగే, అప్పటి సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వివరించినట్టు తెలుస్తోంది. జగన్ సర్కారు పిఎ కేఎన్ఆర్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని సింగ్ చెప్పినట్టు సమాచారం.
సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీకాంత్, రీతూ చౌదరి పేరుపై అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలుస్తోంది. గోవాలో సింగ్ను బలవంతంగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు దారితీసినట్లు ఆయన ఆరోపణలు చేశారు. రీతూ చౌదరి, శ్రీకాంత్ ద్వారా గోవాకు చేరుకున్నారని, ఆమె పేరుతో జరుగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి మరిన్ని వివరాలు అందించినట్లు సమాచారం.
ఇప్పటి వరకు రీతూ చౌదరి ఈ కేసులో తనకు సంబంధం లేదని చెబుతూ వస్తున్నా, ప్రస్తుతం విచారణలో ఏమి వెల్లడిస్తారన్నది ఉత్కంఠగా మారింది. సింగ్ నుండి ప్రశ్నించడం ముగిసిన తర్వాత శ్రీకాంత్, రీతూ చౌదరి వీరి పై నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిపించే అవకాశాలు ఉన్నాయి.
సింగ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కేఎన్ఆర్, సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. రీతూ చౌదరి, శ్రీకాంత్ ఇచ్చే వివరణలు ఈ కేసులో కీలక మలుపు తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసు నుంచి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తే, అది రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది.