రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు లైగర్ కష్టాలు తప్పడం లేదు సినిమా విడుదలై డిజాస్టర్ గా మిగిలినా. ఈ మూవీకి సంబంధించి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సినిమా పెట్టుబడుల విషయంలో ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తులు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండను బుధశారం (నవంబర్ 30)న ప్రశ్నించింది.
ఈడి ముందుకి విజయ్ దేవరకొండ
లైంగర్ మూవీకి సంబంధించి పెట్టుబడుల విషయంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హీరో విజయ్ దేవరకొండ కొంత సేపటికి క్రితమే హాజరయ్యాడు. చిత్ర నిర్మాణానికి సంబంధించి ఈడీ చాలా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. చిత్ర నిర్మాణం హీరో రెమ్యునరేషన్, మూవీ పెట్టుబడి తదితర విషయాలపై ప్రశ్నించనుంది.
దీనికి సంబంధించి ఇది వరకే నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో డైరెక్టర్ పూరి ప్రొడ్యూసర్ చార్మి ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండను ఈడీ ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది.
భారీ డిజాస్టర్..
లైగర్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించారు. దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తీసిన ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేశారు. కానీ ఈ మూవీ ఒక డిజస్టర్ గా మిగిలిపోయింది. ఇందులో వచ్చిన నష్టాలను కూడా ఈడీ విచారిస్తుంది.
విదేశాల నుంచి కూడా ఈ మూవీకి పెట్టుబడులు వచ్చినట్లు ఈడీ వద్ద సమాచారం ఉందని, దీనితో పాటు స్థానిక పొలిటీషన్లు కూడా ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా గతంలో చార్మి, పూరిని ప్రశ్నించిన ఈడీ ఇప్పుడు హీరో వంతుగా విజయ్ దేవరకొండును ప్రశ్నించింది.
హీరో విజయ్ దేవరకొండ ఈడీ ఆఫీస్ కు వెళ్లడం సినీ ఇండస్ర్టీ, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ వారికి ఏం చెప్తాడో అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ మూవీలో విజయ్ కు జతగా అనన్య పాండే నటించారు. మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాపియన్ మెకెల్ జాక్సన్ కూడా ఇందులో అతిథి పాత్రలో కనిపించాడు.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీలో కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. కానీ ఇది అన్ని భాషల్లో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఇటు పూరీ, అటు చారీ, విజయ్ దేవర కొండ సైతం డీప్రెషన్ కు వెళ్లారు. దీనికి తోడు ఈడీ విచారణలు. ఇప్పుడు విజయ్ దేవర కొండ చేతిలో ‘ఖుషి’ ప్రాజెక్టు ఉంది.
ఈ సినిమా షూటింగ్ వేగంగా దూసుకుపోతోంది. ఈ మూవీపై విజయ్ కు భారీ అంచనాలే ఉన్నాయి. ఇది తప్పక హిట్ సాధించి లైగర్ గాయాలను మాన్పుతుందని విజయ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.