సల్మాన్ ఖాన్ పేరు బాలీవుడ్‌లో ప్రత్యేకమైనది. ‘భాయ్’ అని అభిమానులు పిలుచుకునే సల్మాన్, కేవలం నటనలోనే కాకుండా తన స్టైల్, లగ్జరీ లైఫ్‌తో కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన ధరించే వస్తువుల నుంచి ఉపయోగించే వస్తువుల వరకు ప్రతిదీ ప్రత్యేకమైనదే. 59 సంవత్సరాల వయసులోనూ, తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, నటనతో పాటు వ్యాపారాల్లోనూ విజయాలను సాధిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ తన నటజీవితాన్ని చిన్న పాత్రలతో ప్రారంభించి అంచలంచలుగా ఎదిగారు. బాలీవుడ్ రొమాంటిక్ సూపర్ హిట్ “మేనే ప్యార్ కియా” మూవీ తో స్టార్ హోదా పొందారు. అప్పటి నుంచి అనేక హిట్ సినిమాలు అందిస్తూ, బాలీవుడ్‌లో అగ్ర హీరోగా ఎదిగారు. బుల్లితెరపై కూడా ఆయన హవా కొనసాగుతోంది. హిందీ బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ, ఆయన దేశవ్యాప్తంగా మరింత పాపులారిటీ సంపాదించారు.
ఇక సల్మాన్ ఖాన్ నికర ఆస్తుల విలువ సుమారు రూ. 3000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఆయన హీరోగానే కాకుండా అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ, వాణిజ్య రంగంలో తనదైన ముద్ర వేశారు. బీయింగ్ హ్యూమన్ అనే తన స్వంత బ్రాండ్ ద్వారా చారిటీ కోసం పనిచేస్తున్నారు. ఈ బ్రాండ్ ద్వారా వచ్చిన లాభాల నుంచి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ముంబైలోని బాంద్రాలో గల గ్యాలక్సీ అపార్ట్‌మెంట్ విలువ సుమారుగా రూ. 150 కోట్లు. పన్వేల్‌లోని ‘అర్పిత ఫామ్ హౌస్’ 150 ఎకరాల్లో విస్తరించి ఉంది. ముంబైలోనే, గోరాయ్ బీచ్ పక్కన రూ. 100 కోట్ల విలువైన బీచ్ హౌస్ కూడా ఆయన సొంతం. లింకింగ్ రోడ్డులో రూ. 120 కోట్ల విలువైన ప్రాపర్టీ కూడా సల్మాన్ ఖాన్ ఆస్తుల్లో ఒకటి. ఆయన తన భద్రత కోసం రూ. 2 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ కార్‌ను కూడా కొనుగోలు చేశారుసల్మాన్ ఖాన్ తన నిర్మాణ సంస్థ “సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్” ద్వారా “బజరంగీ భాయిజాన్,” “భారత్” వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించారు. ఈ సంస్థ బాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది.
తన ఫిట్‌నెస్ పట్ల తపనతో, దేశవ్యాప్తంగా 300కు పైగా ఫిట్‌నెస్ సెంటర్లను ప్రారంభించారు. ఇవి ఆయన ఆరోగ్య పరమైన దృఢతకు నిదర్శనం.సల్మాన్ ఖాన్, నటనతో పాటు వ్యాపార, సేవా కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉంటూ, బాలీవుడ్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ సెలబ్రిటీలలో ఒకరుగా నిలిచారు.