సినిమాలో కలిసిన నటించిన హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం..ఆ తర్వాత కొన్ని రోజులు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండడం.. కుదిరితే వాళ్ల ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్లడం టాలీవుడ్ లో పరిపాటి. ఇలా పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ కపుల్ సమంత ,నాగచైతన్య. ఈ ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పటి నుంచి టాలీవుడ్ అభిమానుల ఫేవరెట్ కపుల్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అనుకోకుండా ఈ ఇద్దరు విడాకులు తీసుకోవడం అందరిని షాక్ కి గురిచేసింది.
అయితే అప్పటినుంచి వీలు చెక్కినప్పుడల్లా ఈ ఇద్దరికీ సంబంధించిన విడాకుల టాపిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. మరి ముఖ్యంగా సమంత ఏదో ఒకరకంగా తన పెళ్లి, విడాకులు లాంటి టాపిక్ లు సంభాషణలో ఉండే విధంగా చూసుకుంటుంది. నాగచైతన్య ,శోభిత ధూళిపాలాని పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో మరొకసారి ఆమె తమ పెళ్లి టాపిక్ ని హైలైట్ చేసింది.
సమంత యాక్షన్ పాకెడ్ వెబ్ సిరీస్ ‘సిటడెల్’ప్రచారంలో భాగంగా వివిధ మీడియా సంస్థలు నిర్వహిస్తున్న టాక్ షోస్ లో ఆమె పాల్గొంటుంది. ఈ క్రమంలో తన డివోర్స్ గురించి సమంత ప్రస్తావించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎప్పుడైనా ఇద్దరి మధ్య బంధం పాడైతే అమ్మాయిలని నిందిస్తారు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తన డైవర్స్ విషయంలో కూడా తను ఎన్నో అవాస్తవాలను ఎదుర్కొన్నట్టు ఆమె పేర్కొనడం గమనార్హం.
ఈ నేపథ్యంలో గతంలో ఆమె పెళ్లి గౌన్ ని రీ మోడల్ చేసిన విషయం గురించి కూడా స్పందించింది.’మొదట్లో నా పెళ్లి గావుని రీ మోడెల్ చేయాల్సి వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నేను అలా చేయడం వెనుక ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఉద్దేశం లేదు. ఇప్పటికైనా దానిపై వస్తున్న కామెంట్లు ఆపుతాయేమో చూడాలి.’అని ఓ చిన్న క్లారిఫికేషన్ ఇచ్చింది.
దీనితో పాటుగా మరో టాక్స్ షోలో.. తన ఎక్స్ కు ఇచ్చిన బహుమతుల కోసం తను చాలా అనవసరమైన డబ్బు ఖర్చు పెట్టాను అంటూ సమంత మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తన ఎక్స్ కూడా తనకు అంతే విలువైన బహుమతులు ఇచ్చి ఉంటారు కదా మరి అది దుబారా కాదా అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు నాగచైతన్య కి పెళ్లి కూడా జరుగుతోంది ఇంకా ఎప్పటి వరకు డైవర్స్ గురించి మాట్లాడుతూ బతికేస్తారు అని డైరెక్ట్ గానే అడుగుతున్నారు.