
నటీనటులు: వెంకటేష్, ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి, నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, అవసరాల శ్రీనివాస్, ఉపేంద్ర లిమాయె, సాయికుమార్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: శిరీష్
రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి
కథ:
మాజీ పోలీస్ అధికారి వైడీ రాజు (వెంకటేష్) తన ఉద్యోగాన్ని వదిలి పల్లెటూరిలో భార్య భాగ్యం (ఐశ్వర్యా రాజేష్)తో కలిసి కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాడు. అయితే, ఒక ముఖ్యమైన ఆపరేషన్ కోసం తన మాజీ ప్రేయసి మీనాక్షి (మీనాక్షి చౌదరి)తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో రాజు తన భార్య, ప్రేయసి మధ్య ఉన్న విభిన్న భావోద్వేగాలతో పాటు ఆపరేషన్ను విజయవంతంగా ఎలా పూర్తి చేశాడనేదే ప్రధాన కథ.
వెంకటేష్ తన క్యారెక్టర్లో కంప్లీట్ గా న్యాయం చేశారు. ఫ్యామిలీ టచ్ ఉన్న కామెడీ రోల్స్ ఆయనకు బాగా సూటవుతాయని మరోసారి నిరూపించారు. ఐశ్వర్యా రాజేష్ అమాయకమైన పల్లెటూరి ఇల్లాలిగా చక్కటి నటన కనబర్చారు. వీరి మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం. అనిల్ రావిపూడి తన స్టైల్లో వినోదాన్ని పండించడంలో విజయవంతం అయ్యారు, కానీ కథలో లాజిక్కులు పూర్తిగా మిస్ అయ్యాయి.
పల్లెటూరి నేపథ్యంలో వచ్చే కుటుంబ సన్నివేశాలు, భర్త-భార్య మధ్య ఫన్నీ సీన్స్ తో సాగే కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చిన్నారి బుల్లిరాజు పాత్ర నవ్వులు పంచడంలో ప్రత్యేకంగా నిలిచింది. కానీ సెకండ్ హాఫ్ లో కామెడీ సిల్లీగా ఉండటం తో కంటెంట్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది.
ఇక ఆపరేషన్ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలు కథకి భిన్నంగా తెచ్చి అతికించినట్లుగా ఉన్నాయి. చాలావరకు సీన్స్ లో లాజిక్ మిస్ అయింది. ఇక హీరో గురువు క్యారెక్టర్.. ఆ ఇద్దరి మధ్య సాగే ఎమోషనల్ ట్రాక్ కు మూవీ తో సంబంధం లేదు అనిపిస్తుంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి సంక్రాంతి ఎంజాయ్ చేయడానికి ఈ మూవీ కరెక్ట్ గా సెట్ అవుతుంది. సినిమాలో పెద్దగా కొత్తదనం లేకపోయినప్పటికీ కామెడీ పరంగా మాత్రం ఈ మూవీస్ స్ట్రాంగ్ గా ఉంది. వెంకీ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో.. ఈ చిత్రం సంక్రాంతికి హిట్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రేటింగ్: 3/5