ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు సౌత్ నార్త్ తేడా లేకుండా సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా పుష్ప మానియా కనిపిస్తుంది.పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకులు ఎందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా ఈవెంట్లు ప్లాన్ చేస్తూ నార్త్ నుంచి సౌత్ వరకు కవర్ చేస్తున్నారు. మరోపక్క అల్లు అర్జున్, రష్మిక ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
తాజా గారికి వచ్చేలా జరిగిన పుష్ప ఈవెంట్ భీభత్సమైన రెస్పాన్స్ అందుకు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన మరొక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పుష్ప 2: ది రూల్ మూవీకి సంబంధించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయని టాక్. ఇక దేనికి సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేసిందట. అయితే కొన్ని చోట్ల మాత్రం బోర్డు తరఫునుంచి కొన్ని మార్పులు చెప్పినట్లు సమాచారం. మరి ఇంతకీ ఆ మార్పుల వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
పుష్ప చిత్రంలో మాస్ డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే.. ఇక దానికి సీక్వల్ గా వస్తున్న పుష్ప 2లో కంటెంట్ మరింత మాస్ బీభత్సం సృష్టించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ సర్టిఫికెట్ వచ్చింది. అయితే ఐదు విషయాల్లో మాత్రం మార్పులు చేయమని సెన్సార్ బోర్డ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. వీటిలో సినిమా మధ్యలో వచ్చే ఒక అసభ్య పదాన్ని మార్పు చేయడం.. రండి అనే పదాన్ని మరొక పదంతో మార్చమని సెన్సార్ బోర్డు సూచించింది.
అలాగే ఓ సందర్భంలో విలన్ కాలుని హీరో నరికినప్పుడు ఆ కాలు గాలిలోకి ఎగిరే సీన్.. నరికిన చేతిని హీరో పట్టుకున్న సన్నివేశం.. ఇలాంటి రెండు సన్నివేశాలని సీజీతో కవర్ చేయాల్సిందిగా సూచించారు. అలాగే ఒక సందర్భంలో వెంకటేశ్వర అంటూ సాగే మాటని భగవంతుడిగా మార్చమని కూడా సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక ఈ మూవీ రన్ టైం విషయానికి వస్తే సుమారు 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్ల నిడివి ఉంది అని సమాచారం.