Wednesday, September 22, 2021

శేఖర్ ధావన్, అయేషా ల మధ్య గొడవ.. విడాకులు

భారత క్రికెటర్ శేఖర్ ధావన్, అతడి భార్య అయేషాలు విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అయేషా తన ఇస్ట్గ్రా లో పోస్ట్ చేసింది. ఆ వివరాలలోకి వెళితే క్రికెటర్ శేఖర్ ధావన్, అయేషా లు ఫేస్బుక్ లో పరిచయం అయింది. ఇద్దరి మధ్య చాటింగ్ నడిచింది. ఆ తరువాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 2012 లో వీళ్లు ఇరువురు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ఆసక్తికమైన విషయం ఏంటంటే అయేషా శేఖర్ ధావన్ కన్నా వయసులో పెద్దది. అయేషాకి అప్పటికే పెళ్లి అయి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు.

మొదటి భర్తతో విడిపోయిన ఆమె తరువాత ధావన్ ని పెళ్లి చేసుకొని మెగా బిడ్డకి జన్మని ఇచ్చింది. వీరి ఇద్దరి మధ్య 11 ఏళ్ళు వయసు తేడా ఉంది. ప్రస్తుతం శేఖర్ ధావన్ వయసు 35 కాగా, అయేషా వయసు 46 . అయితే ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్న ఈ జంట, పట్టుమని పదేళ్లు కూడా కలసి కాపురం చేయలేదు. ఇప్పుడు వీరి విడాకులు హాట్ టాపిక్ గా మారింది. అయేషా తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్నాక 10 ఏళ్ళు ఒంటరిగా జీవించింది.

తరువాత ఆమె జీవితంలోకి శేఖర్ ధావన్ ఎంటర్ అయ్యాడు. గత ఏడాది నుండి వీరి ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అన్ ఫాలో కావడంతో అప్పుడే చర్చ మొదలైంది. ఊహించినట్లే చివరికి విడిపోయినట్లు ప్రకటించింది అయేషా. తాజాగా తన ఇస్ట్గ్రామ్ లో నుండి శేఖర్ ధావన్ ఫోటోలు పూర్తిగా తొలగించింది. అయితే శేఖర్ ధావన్ ఇస్ట్గ్రా లో మాత్రం అయేషా ఫోటోలు ఇంకా అలానే ఉన్నాయి.

Latest Articles