తమిళ స్టార్ హీరోయిన్ నయనతార పేరు ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల కంటే, వివాదాలతోనే ఎక్కువగా ప్రచారం పొందుతోంది. ముఖ్యంగా, ఇటీవల ధనుష్‌పై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పుడు సింగర్ సుచిత్ర కూడా నయనతారపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో, ఈ వివాదం మరింత రచ్చకెక్కింది. దీంతో మరొకసారి సోషల్ మీడియాలో నయనతార, ధనుష్ మధ్య జరుగుతున్న ఇష్యూపై చర్చ మొదలైంది.
సింగర్ సుచిత్ర, సుచి లీక్స్ పేరుతో ప్రారంభించిన యూట్యూబ్ చానల్ ద్వారా ప్రముఖుల వ్యక్తిగత విషయాలను బహిరంగం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. సుచిత్ర వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో విమర్శలతో కూడుకుని ఉంటాయి. రీసెంట్గా నయనతారను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. నయనతార ధనుష్‌పై చేసిన ఆరోపణలు సుచిత్ర దృష్టికి వెళ్లాయని, వాటిని ఆమె ప్రశంసించినట్లు పేర్కొంది. అయితే, ఆ రెండు వ్యక్తుల మధ్య కోర్టు వివాదం తలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. సుచిత్ర మాత్రం ఈ వివాదాన్ని ఇద్దరి డబ్బు అహంకారానికి ఉదాహరణగా పేర్కొంది.
ఇటీవల నయనతార ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన డాక్యుమెంటరీ సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయని, ఇతర చిత్రాల కంటే వాటిపై అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపారని చెప్పింది. ఈ వ్యాఖ్యలు సుచిత్రకు అసహనాన్ని కలిగించాయట. అంతేకాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ధనుష్, నయనతార మధ్య జరుగుతున్న పోరు ఇద్దరు ధనవంతుల మధ్య పోరు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
అంతేకాదు, బాలీవుడ్‌కు చెందిన అనుపమ చోప్రా ఇటీవల నయనతారను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యల వెనుక డబ్బు మాయ ఉందని కూడా సుచిత్ర విమర్శించింది. సెలబ్రిటీలను పొగడ్తలతో ముంచడమే ఆమె పని అంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు మరోసారి నయనతార ధనుష్ ఇష్యూ తెర మీదకు వచ్చింది.సుచిత్ర వ్యాఖ్యలపై ఇటు నయనతార..అటు ధనుష్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. నయనతారపై వచ్చిన కామెంట్లలో పలువురు ఆమెకు అహంకారం తగ్గించుకోవాలని సలహాలు ఇస్తున్నారు.