స్మృతి మంధాన లవ్ ఫెయిల్.. విషాదంగా ముగిసిన ప్రేమ కథ

0
smriti
smriti mandhana

భారత మహిళా క్రికెట్ టీంలో సీనియర్ గా ఉండి స్మృతి మంధాన వరల్డ్ కప్ గెలిచారు. పట్టలేని సంతోషంలో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అటు అభిమానుల్లో కోలాహలం నెలకొంది. తన ప్రియుడు మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ తో ఒక్క రోజులో పెళ్లి అనగా అనుకోకుండా పెళ్లి వాయిదా పడింది. కొన్నిఆ రోజులు ఆగాక పెళ్లి రద్దు అని ప్రకటనతో ఇన్నాళ్ల ప్రేమ కథ.. చివరికి విషాదంగా ముగిసింది.

ఏమి జరిగిందో ఏమో ఎవరికీ అంతు పట్టడంలేదు. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఆమె తండ్రి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక కూడా పెళ్లి ప్రస్తావన తీసుకురాకపోవడంతో అనుమానాలు మొదలు అయ్యాయి. అంతే కాక స్మృతి తన సోషల్ మీడియా ఖాతాలో నుండి హల్దీ, మోహందీ వేడుకల ఫోటోలు, వీడియోలు తీసేయడంతో అనుమానాలు బలపడ్డాయి.

దీనితో వదంతులు మొదలయ్యాయి. వీరి పెళ్లి రద్దు అయిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడిచింది. అంతే కాక ఆమె ప్రియుడు మరో అమ్మాయితో చాటింగ్ చేసినట్లు కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడం విశేషం. దీనితో ఎట్టకేలకు ఈ ప్రేమకథకి స్వయంగా స్మృతి మంధాన పులిస్టాప్ పెట్టింది. తన ఇంస్టా వేదికగా పెళ్లి రద్దు చేసుకున్నట్లు ప్రకటింది. “పలాశ్ తో నా పెళ్లి రద్దు అయింది. నేను ఇంతటితో ఈ విషయాన్ని వదిలేస్తున్నా. మీరూ వదిలేయండి” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.