తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్న ప్రాముఖ్యత మిగిలిన ఆర్టిస్టులకు ఉండదు. మరి ముఖ్యంగా బడా హీరోల సినిమాలు అయితే వాళ్ల వీలుని పట్టి మిగిలిన వాళ్ళు షూటింగ్ కి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇమాన్వి పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి ప్రభాస్ లాంటి స్టార్ హీరో తో నటించాలి అంటే ఆ మాత్రం తప్పదు కదా. ఇంతకీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
అందాల రాక్షసి చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన హనుమ రాఘవపూడి తక్కువ కాలంలోనే మంచి సక్సెస్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ హీరోగా అతను తెరకెక్కించిన సీతారామం సక్సెస్ తర్వాత మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ అతన్ని పొగిడేస్తున్నాడు. ఇప్పటివరకు కెరీర్ లో ఎక్కువ శాతం లవ్ స్టోరీస్ తెరకెక్కించిన హను.. ప్రభాస్ తో ఓ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
సీతారామం సక్సెస్ తర్వాత దుల్కర్ సల్మాన్ కి టాలీవుడ్ లో మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో అందరికీ తెలుసు. ఇక ప్రభాస్ హీరోగా హనూ తెరకెక్కిస్తున్న ఫౌజీ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 1940 నాటి బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. అంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో అన్నమాట.
ఇక మూవీ టైటిల్ ఫౌజి కాబట్టి ఇందులో కచ్చితంగా ప్రభాస్ ఓ సోల్జర్ పాత్రలో కనిపిస్తాడు అన్న విషయం మనం గెస్ చేయవచ్చు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్గా ఇమాన్వి నటిస్తోంది. ఆమె పేరు అలా ప్రకటించారు లేదు 24 గంటల్లో ఆమెకు 60 వేల మంది ఫాలోవర్స్ ఆడ్ అయ్యారు. సినిమా రిలీజ్ కాకముందే ఆమె గురించి హారాలు తీయడం మొదలుపెట్టేశారు..
అయితే ఆమె గురించి సెర్చ్ చేసే నేపథ్యంలో బయటపడిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఈ మూవీ కోసం ఒక సంవత్సరం పాటు కంప్లీట్ గా ఆమెను లాక్ చేశారట. అంటే ఆమె ఈ సంవత్సరం పాటు ఇక ఏ సినిమాల్లో నటించదు. ఎందుకంటే ప్రభాస్ డేట్స్ ని పట్టి ఆమె షూటింగ్ కి రావాల్సి ఉంటుంది. వేరే సినిమా ఒప్పుకుంటే షూటింగ్స్ కొలైడ్ అయ్యే అవకాశం ఉంది కదా. మరి ప్రభాస్ లాంటి హీరో పక్కన ఛాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా అంటున్నారు నెటిజన్లు.