Saturday, April 17, 2021

40 లక్షలకు రూపాయి తగ్గినా చేయను అన్నాడు.. ఆజన్మాంతం గుర్తిండి పోయే పాత్రను వదుకున్నాడు




అవకాశం రావాలే గానీ వెండితెరపై వెలిగిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అలాంటి అవకాశం సంపాదించడానికి ఎంతగా చెమటోడ్చాలో సినీ రంగంలో సెబ్రిటీలుగా వెలిగిపోయిన, పోతున్న ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. ఆ కష్టాలు మామూలుగా ఉండవు. అందుకే ‘‘కష్టాలందు సినిమా కష్టాలు వేరయా..’’ అంటారు. అలా తాను ఎన్నో కష్టాలకు ఓర్చుకుని తెలుగు సినీ రంగంలో స్టార్‌ హీరోగా తనకంటూ ఓ ముద్ర వేసుకున్న నటుడు వయసు మళ్లడంతో ఇంటికే పరిమితం అయ్యాడు.

అదృష్టం ఉంటే ఇంట్లో కాళ్లు చాపుకుని కూర్చున్నా అవకాశాలు తలుపు తడతాయి అన్న మాటను నిజం చేస్తూ ఆయనకు ఆజన్మాంతం గుర్తుండిపోయే ఓ పాత్ర ఆయన దగ్గరకు వచ్చింది. అయితే రూపాయి విషయంలో విపరీతమైన పట్టును ప్రదర్శించే ఆ నటుడు 40 లక్షలకు ఒక్క రూపాయి తగ్గినా ఆ పాత్రను చేయనని మంకుపట్టు పట్టారు. దర్శక నిర్మాతలు ఎంతగా ఒప్పించాలని చూసినా ఆయన మాత్రం ససేమిరా అన్నాడు. ఇక చేసేది లేక ఆ పాత్రకు 15 లక్షలకు మరో నటుణ్ణి ఎంచుకున్నారు. సినిమా విడుదలైంది. సూపర్‌డూపర్‌ హిట్‌. ఆ పాత్ర చేసిన నటుడు ఎక్కడికి వెళ్లినా ఇప్పటికీ ఆ పాత్రధారిగానే చూస్తూ చేతులెత్తి మొక్కుతున్నారు ప్రజలు. కొందరైతే ఏకంగా సాష్ఠాంగ నమస్కారాలు కూడా చేస్తున్నారట.

విషయంలోకి వస్తే ఆ పాత్ర ‘అన్నమయ్య’ చిత్రంలోని కలియుగ దైవం వేంకటేశ్వరుని పాత్ర. మొదట సంప్రదించి నటుడు నటభూషణ్‌ శోభన్‌బాబు. ఆ తర్వాత ఆ పాత్ర చేరింది సుమన్‌ చెంతకు. సుమన్‌ కెరీర్‌లో ఇదొక మేలి మలుపుగా మిగిలిపోయింది. ఇప్పుడే కాదు.. మరో 4,5 జనరేషన్‌ ప్రజలు కూడా సుమన్‌ను ఆరాధనా భావంతో చూస్తూనే ఉంటారు. సుమన్‌ నటనకు తోడు, ఆ పాత్రకు స్వర్గీయ ఎస్‌.పి. బాసుబ్రహ్మణ్యం చెప్పిన డబ్బింగ్‌ నభూతో న భవిష్యతి అన్నట్లుగా మారాయి.

ఈ సినిమా విడుదల అనంతరం ఓ సందర్భంలో తనను కలిసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో శోభన్‌బాబు ‘‘నా జీవితంలో తెలిసి తెలిసి నేను చేసిన తప్పు వేళ్లమీద లెక్కపెట్టుకునేంత ఉంటాయి వాటిలో ‘అన్నమయ్య’ సినిమా వదులుకోవడం కూడా ఒకటి అన్నారట. జయాపజయాలకు, పొగడ్తలకు, విమర్శలకు అతీతంగా ఏదీ పట్టించుకోని శోభన్‌బాబు ఆ మాట అన్నారంటే ఆయన్ను ఆ పాత్ర ఎంతగా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు.




Related Articles

Latest Articles