అరుంధతి సినిమాలో పశుపతి గా అందరినీ భయపెట్టినా.. సోను సూత్ కి తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాన్ ఇండియా నటుడిగా అతనికి మంచి గుర్తింపు కూడా ఉంది. నిజానికి కరోనా సమయంలో అతను రియల్ హీరో లాగా ముందుండి అందరితో సహాయం చేసిన వైనం అతనిపై అందరికీ తెలియని ఇష్టాన్ని పెంచింది. తనతో పాటు తన భార్య పేరు మీద ఉన్న ఆస్తులను కూడా అమ్మి ప్రజలకు అండగా నిలబడ్డ సోనుసూద్ లో విలన్ ని కాకుండా ప్రపంచం హీరోని చూసింది..
ఇక ఇప్పుడు తాజాగా అతని మంచితనానికి గౌరవం లభించడం అందరికీ ఆనందంగా ఉంది. సామాజికంగా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని ప్రోత్సహించడానికి గాను సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28వ తేదీన “సంకల్ప్ దివాస్” అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో సమాజ సేవ లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తులను ప్రత్యేకంగా గుర్తించి సత్కరిస్తారు.
ఈ సంవత్సరం సంకల్ప దివాస్ అవార్డు సోను సూదికి వచ్చింది. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లలితా కళా తోరణం లో నవంబర్ 28వ తారీఖున జరిగే సంకల్ప్ దివాస్ కార్యక్రమంలో సాయంత్రం ఐదు గంటలకి సోను సూత్ కి ఈ అవార్డ్ ప్రధానం చేస్తారు. ఇక ఈ కార్యక్రమానికి భారత బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ అయిన హెచ్ఈ నికోలాయ్ యాంకోవ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఈ అవార్డును ఆయన చేతుల మీదగా సోనీ సూట్ అందుకుంటారు అని తెలుస్తోంది.
కరోనా సమయం నుంచి ఇప్పటివరకు అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటూ.. సహాయం చేస్తూ..మంచి మనసును చాటుకున్న సోనీ సూద్ సమాజ సేవను గుర్తించి ఆయనకు ఈ అవార్డు అందిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది సోను సూడ్ని అభినందిస్తున్నారు. ఆన్ స్క్రీన్ విలన్ పాత్రలు చేస్తునన్నా.. ఆఫ్ స్క్రీన్ మాత్రం అతను రియల్ హీరో అని పొగుడుతున్నారు.