కాలుష్యం ఎంతటి వినాశకారో మనందరికీ తెలిందే.. దీని దెబ్బకు ప్రపంచ పర్యావరణం అనూహ్య మార్పులకు గురౌతోంది. అనేక వృక్ష, పక్షి, జంతు జాతులు ఈ కాలుష్యం కోరలకు చిక్కుకుని అంతరించిపోతున్నాయి.
ప్రతి నిత్యం మనం రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఎంత దుమ్ము, ధూళి, పొగ మన బాడీని అలముకుంటున్నాయో మనకు తెలియంది. కాదు.
మళ్లీ పెళ్లి చేసుకోను.. జీవితాంతం ఒంటరిగా ఉండను
ఈ కాల్యుం దెబ్బకు వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి నడుం బిగించాల్సి వచ్చింది. పల్లెలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా, నగరాలు మహానగరాలుగా అభివృద్ధి చెందే కొద్దీ ఈ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది.
ఈ కాలుష్యం బారి నుంచి తప్పించుకోవటానికి చాలా మంది ఊరికి దూరంగా వెళ్లిపోతుంటారు. ఇలా కాలుష్యం బారిన పడిన తన ఇంటికి అమ్మేసుకుని దూరంగా వెళ్లిపోయారు దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి.
చాలా కాలంగా ఆయన జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి నుంచి కృష్ణానగర్‌కు వచ్చే దారిలో నివాసం ఉంటున్నారు. ఒకప్పుడు ఇది ప్రశాంతమైన రోడ్డు. అంతగా ట్రాఫిక్ కూడా ఉండేది కాదు.
అందుకే కృష్ణారెడ్డి గారితో పాటు పెన్నా సిమెంట్స్ ప్రతాప్‌రెడ్డి, మరికొందరు బిజినెస్ దిగ్గజాలు నివాసాలు కట్టుకున్నారు. రాను రాను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి కృష్ణానగర్ మీదుగా అమీర్‌పేట, శ్రీనగర్ కాలనీవైపు వెళ్లే ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది.
దీంతో వెంకటగిరి వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి వన్‌వే రహదారి చేశారు. ఇప్పుడు ఇది నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో ఓవైపు జనానికి, మరోవైపు స్థానికులకు చుక్కలు చూపిస్తోంది.
ఇదే దారిలో ఎస్.వి. కృష్ణారెడ్డి నివాసం కూడా ఉండటంతో ఆయన ఈ పొల్యూషన్, ట్రాఫిక్ ఇక్కట్లు తట్టుకోలేక ఆ ఇంటిని ఇటీవలే అమ్మేసి, మాదాపూర్ వెళ్లిపోయారు.
ఆ ఇల్లు ఆయనకు ఎంతోసెంటిమెంట్ అయినప్పటికీ పొల్యూషన్ దెబ్బకు అమ్ముకోక తప్పలేదు. ప్రస్తుతం కృష్ణారెడ్డి ఓ కొత్త ప్రేమకథకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. కొత్తజంటతో మరోసారి మన ముందుకు రానున్నారు