మాజీ మంత్రి నారాయణపై విద్యార్థి సంఘాలు దాడి

0
1039

అనంత పురంలో నారాయణ స్కూల్ ల పర్యవేక్షణకు వచ్చిన మాజీ మంత్రి నారాయణకు చేదు అనుభవం ఎదురు అయింది. విద్యార్థుల నుండి లక్షల ఫీజులు వసూళ్లు చేస్తున్నారని పిల్లలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ విద్యార్థి సంఘాలు నిలదీశాయి. ఒక దశలో నారాయణపై దాడికి యత్నించారు. దీనితో స్కూల్ సిబ్బంది, సంఘాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నాయకులు నారాయణ కారుపై రాయితో కొట్టారు. అంతే కాక ఈ తోపులాటలో నారాయణ చొక్కా చిరిగిపోయింది. నారాయణ కారు అద్దాలు కూడా పగిలిపోయాయి.


అనుకోని ఈ ఘటనతో నారాయణ తన పర్యట రద్దు చేసుకున్నారు. నారాయణ అనుచరులు కూడా విద్యార్థి సంఘాలపై దాడి చేసినట్లు తెలుస్తుంది. దీనితో నారాయణ అనుచరులుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.