టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రిలీజ్ అవుతున్న బడా సినిమా పుష్ప అనడంలో ఎటువంటి డౌట్ లేదు. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఇక సుకుమార్ తీస్తున్న సినిమా అంటే లాస్ట్ మినిట్ లో ఉండే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మొదట్లో తాపీ ఈగ షూటింగ్ చేసుకుంటూ వెళ్లి.. లాస్ట్ మినిట్లో బాగా హడావిడి పడడం సుకుమార్ స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్. ఈ నేపథ్యంలో చివరి నెలరోజుల నుంచి సుకుమార్ రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఒకరకంగా రిలీజ్ కి ముందు సుకుమార్ నిద్రాహారాలు కూడా మానేస్తాడు అని అతని టీం అంటుంటారు. ఎంత పర్ఫెక్ట్ గా సినిమా తీసిన లాస్ట్ మినిట్ వరకు సంతృప్తి లేకుండా కరెక్షన్లు చేయడం.. ఎడిటింగ్ లో మార్పులు, చేర్పులు.. ఇదంతా సుకుమార్ కి మామూలే.
పుష్ప 1 రిలీజ్ సమయంలో కూడా సుకుమార్ ప్రమోషన్ ఈవెంట్స్ లో అస్సలు పాల్గొలేదు. రిలీజ్ కి ఒక్కరోజు ముందు కూడా ముంబైలో ఉండి ఎడిటింగ్ పనులు పర్యవేక్షిస్తూ గడిపారు. ఈ నేపథ్యంలో రేపు విడుదల కాబోతున్న పుష్ప 2 మూవీ కోసం సుకుమార్ మరింత కష్టపడుతున్నట్లు టాక్. గత మూడు వారాలుగా అసలు తీరిక లేకుండా ఈ మూవీ కోసమే అతను పనిచేస్తున్నారు. ఒకవైపు షూటింగ్, మరోవైపు ఎడిటింగ్.. ఇలా తీరిక లేకుండా తిరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో పుష్ప 2 కు సంబంధించిన ఏ ఈవెంట్ లో కూడా సుకుమార్ కనిపించలేదు. కానీ హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మాత్రం హాజరయ్యారు. అయితే ఈ ఫంక్షన్ లో సుఖమాన్ని చూసిన ఎవరైనా సరే అతనికి హెల్త్ బాగలేదేమో అని అనుకుంటారు. అంత నీరసంగా కనిపించాడు మరి. నిద్ర లేకపోవడం, విపరీతంగా పనిచేయడం వల్ల సుకుమార్ అలా తయారయ్యాడు అనేది అతని టీం సమాచారం. మరి ముఖ్యంగా ఒక సందర్భంలో సుకుమార్ గురించి బన్నీ మాట్లాడుతుంటే అసలు అర్థం కానట్టు సుకుమారి ఎటో చూస్తూ నిలబడ్డాడు. అతి కష్టం మీద నాలుగు మాటలు మాట్లాడి తన స్పీచ్ గబక్కను ముగించేసాడు. అయితే అనుకున్నట్టు మూవీ సక్సెస్ సాధిస్తే.. కొన్ని రోజుల తర్వాత జరిగే సక్సెస్ మీట్ లో తిరిగి సుకుమారిని హుషారుగా చూడవచ్చు అంటున్నారు చిత్ర బృందం.