ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో.. పుష్ప పండుగ జరుగుతుంది. థియేటర్ల వద్ద ఎక్కడ చూసినా పండుగ వాతావరణంతో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 12,500 స్క్రీన్ లపై భారీగా ఈ చిత్రం విడుదలయ్యింది. ప్రీమియం షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్స్ కొల్లగొడుతుంది అని అందరూ భావిస్తున్నారు.
విడుదల కి ఒక్కరోజు ముందు శనివారం నాడు రాత్రి 9:00 నుంచే చాలా చోట్ల బెనిఫిట్ షోలు పడిపోయాయి. గతంలో ఎన్నడు కనివిని ఎరుగని విధంగా టికెట్ రేట్లు భారీగా పెరగడంతో.. దాని ఇంపాక్ట్ పుష్ప కలెక్షన్స్‌పై ఉంటుందని.. థియేటర్లకు పెద్దగా జనం రాకపోవచ్చు అని ప్రచారం జరిగింది. అయితే అందరూ అంచనాలను తలకిందులు చేస్తూ థియేటర్ల వద్ద మాస్ జాతర సృష్టించారు అల్లు అర్జున్ అభిమానులు.
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకి ఫాన్స్ ఎక్కువ సందడి చేస్తారు.. అయితే ఈసారి చాలామంది లేడీ అభిమానులు కూడా పుష్ప 2 థియేటర్ వద్ద హంగామా సృష్టించారు. ఇంత మంచి సినిమా తీసిన సుకుమార్ కి గుడి కట్టించాలి అని కొందరు అభిమానులు పుష్ప డైరెక్టర్ ని తెగ పొగిడేస్తున్నారు.”సినిమా ఏముందన్న.. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్‌లకు మైండ్ బ్లాక్ అవుతోంది.. అసలు రాంప్ ఆడేసాడు.. ఈ క్రేజ్.. ఫైట్స్ మతి పోగోడుతున్నా.. కచ్చితంగా సుకుమార్‌కి గుడి కట్టేయాలి..”అని ఓ అభిమాని తన మనసులోని అభిమానాన్ని అలా చాటుకుంది.
మరొక అల్లు అర్జున్ తాత పేరు నిలబెట్టాడని.. కొంతమంది అల్లు రామలింగయ్య ని గుర్తు చేసుకున్నారు. పేరుకి కామెడీ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్యకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. ఆయన అలా స్క్రీన్ మీద కనిపిస్తే చా.. ఆ కళ్ళు 100 డైలాగులు పలుకుతాయి. అల్లు రామలింగయ్య లెగసీని ఆయన కొడుకు అల్లు అరవింద్ కంటిన్యూ చేయలేకపోయారు. ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకున్న అల్లు అరవింద్ కొన్ని సినిమాలలో నటించినప్పటికీ యాక్టింగ్ లో అల్లు రామలింగయ్య వారసుడు కాలేకపోయాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తాతను మించి స్టార్ హీరోగా ఎదగడం అల్లు అభిమానులకు ఎంతో ఆనందంగా ఉంది.