పాన్ ఇండియా లెవెల్ లో తన మాస్ కంటెంట్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్. అయితే అతను కేవలం ఒక డైరెక్టర్ మాత్రమే కాదు.. అంతకంటే గొప్ప గురువు…ఎందుకంటే అతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు, రైటర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇది చాలా సందర్భాలలో రుజువైన సత్యం. ఒకరకంగా చెప్పాలి అంటే సుకుమార్ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చిన ప్రతి అసిస్టెంట్ నేను సుకుమార్ శిష్యుణ్ణి అని ఎంతో గర్వంగా చెప్పుకొని మని సినిమాలు చేస్తున్నారు.
మన బుచ్చిబాబు, సూర్య ప్రతాప్ లాంటి వారందరూ సుకుమార్ బ్రాండ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చినవారే. వచ్చినా అవకాశాలను అందిపుచ్చుకొని తాము ఏంటో ప్రూవ్ చేసుకుంటూ అసిస్టెంట్ల నుంచి మెల్లిగా పైకి ఎదిగిన వారే. ఒకరకంగా చెప్పాలి అంటే సుకుమార్ దగ్గర పని చేసే ప్రతి అసిస్టెంట్.. సుకుమార్ ని ఒక గొప్ప గురువుగా భావించి జీవితంలో ముందుకెళ్తున్నారు. దీనికి ముఖ్య కారణం సుకుమార్ ఆయన శిష్యులకు ఇచ్చిన ప్రాధాన్యత అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు.
సుకుమార్ దగ్గర వర్క్ నేర్చుకునే విధానం.. దాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేసే వైనం అతని దగ్గర పని చేసిన వ్యక్తులకు ఓ గొప్ప స్థానాన్ని కల్పిస్తోంది. సుకుమార్ కూడా తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్లను స్వయంగా మీడియాకు పరిచయం చేయడం.. తన శిష్యులపై అతనికి ఉన్న నమ్మకానికి ప్రతీక. తాజాగా పుష్ప 2 ప్రమోషన్ లో భాగంగా సుకుమార్ తన దగ్గర పని చేసిన మీడియాకు పరిచయం చేయడమే కాకుండా వారిలోని ప్రతిభ గురించి వివరించి చెప్పారు.
నిజంగా ఒక స్టార్ డైరెక్టర్ తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ల గురించి ఇలా ప్రస్తావించడం ఓ విడ్డూరం అనే చెప్పాలి. అంతేకాదు తన దగ్గర పనిచేసిన వాళ్ల పనితనం గురించి ఎంతో గొప్పగా చెప్పడానికి ధైర్యం కూడా కావాలి. సాధారణంగా మన ఇండస్ట్రీలో చాలామంది ఒక రకమైన అభద్రత భావంతో బతుకుతారు.. పక్కన వారు గొప్పగా ఉంటే చూసి ఓర్చుకోలేదు. కానీ సుకుమార్ వీటికి భిన్నంగా తనదైన శైలిలో తన దగ్గర పనిచేసిన వారి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతారు.
చచాలామంది డైరెక్టర్లు తమ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ల గురించి కనీసం స్టేజీ మీద ప్రస్తావించరు.. కానీ సుకుమార్ అలాంటి డైరెక్టర్ కానీ కాదు. తాను ఎదగడంతో పాటు తన కింద పని చేసిన వాళ్ల గురించి కూడా ప్రపంచానికి తెలియడం ముఖ్యమని భావించే వ్యక్తి. అసలు నూతన దగ్గర పని చేయాలి అంటే సర్టిఫికెట్లతో అవసరం లేదు.. ప్రతిభ ఉంటే చాలు. తెలుగు సినీ ఇండస్ట్రీ తరతరాలు బతికి ఉండాలి అంటే నిజంగా ఇలాంటి డైరెక్టర్ల అవసరం ప్రస్తుతం చాలా ఉంది.