సినిమా హిట్ అని చెవిలో పూలు పెడుతున్నారా? అసలు లెక్క ఇదే

0
7556

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రం గత వారం విడుదల అయి.. మొదటి రోజు భారీగా కలెక్షన్ ను చేసినా.. ఆ తరువాత గాలి బుడగలాగా తేలిపోతుంది. భారీగా హైప్ క్రియేట్ చేయడంతో పాటు.. మొదటి రోజు అభిమానులు ఎక్కువగా చూస్తారు గనుక 53 కోట్ల షేర్ ని రాబట్టింది. అయితే.. ఇప్పటి దాకా 100 కోట్ల షేర్ ని రాబట్టలేకపోయింది. అది కూడా తెలుగు రాష్ట్రాలలో సెలవులు కనుక ఈ మాత్రం కలెక్షన్ లు వస్తున్నాయి. తెలుగు కాకుండా మరి ఏ ఇతర భాషలలోను ఈ సినిమా వసూళ్లు దాదాపుగా మూతపడ్డాయి. శని, ఆది వారాల్లో ఈ సినిమా వరుసగా 7 కోట్లు మాత్రమే సాధించింది. సెలవులు ఉన్నా కూడా ఈ సినిమా చూడడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదని చెప్పవచ్చు. అందుకు నిదర్శనమే ఈ కలెక్షన్ లు.

తొలి రోజు ఏ సినిమాకి అయినా అభిమానులు ఎక్కువగా రావడం.. సినిమా సూపర్ హిట్ అని చెప్పడం సర్వసాధారణమే. అయితే.. ఆ తరువాత గానీ సినిమాలో అసలు దమ్ము ఎంత ఉందో తెలుస్తుంది. అభిమానులు చెప్పినట్లు అన్ని సినిమాలు సూపర్ హిట్ కావు. అలాంటి కోవలోకే వస్తుంది సైరా కూడా. తొలి రోజు అభిమానులు సినిమా బ్లాక్ బస్టర్ అని అన్నారు. ఆ తరువాత దేశ వ్యాప్తంగా తుస్సుమంది. ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. సినిమా హిట్ అయితే.. కలెక్షన్ లు మోత మోగాలి కదా. కలెక్షన్ లు రాకుండా సినిమా హిట్ అంటే.. సినీ ప్రేక్షకులు లోలోపల నవ్వుకుంటున్నారు.

ఒక వేల సౌంత్ సినిమాలకు బాలీవుడ్ లో మార్కెట్ లేదని అనుకుంటే.. కన్నడ హీరో యాష్ నటించిన ‘కేజిఫ్’ చిత్రం ఒక్క హిందీ లోనే 40 కోట్లకి పైగా వసూళ్లు చేసింది. ఈ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదల అయింది. కానీ సినిమాలో దమ్ము ఉండడంతో దేశ వ్యాప్తంగా 250 కోట్లు వసూళ్లు చేసింది. చిరంజీవితో పోలిస్త్తే కన్నడ హీరో యాష్ చాలా చిన్న హీరో. అయినా ఏమాత్రం అంచనాలు లేకుండా హిందీ లో 40 కోట్లు, కన్నడలో 140 కోట్లు.. మొగిలిన భాషల్లో 70 కోట్లు వసూళ్లు చేసింది. అన్ని భాషల్లోని పెద్ద పెద్ద స్టార్ లని తీసుకున్నా కూడా ‘సైరా’ కనీసం తెలుగు మినహా.. దేశ వ్యాప్తంగా 20 కోట్లు కూడా వసూళ్లు చేయలేక పోయింది. ఇప్పటికీ సినిమా హిట్ అని అనుకుంటే.. ఆ పొరపాటు అనుకున్న వాళ్లదే అవుతుంది.