నిండా మునిగిన ‘సైరా’ బయ్యర్లు.. మా డబ్బులు ఇచ్చేయి

0
3149

ఒకవైపు 270 కోట్ల దాకా భారీ బడ్జెట్ పెట్టినా ‘సైరా’ సినిమా డిజాస్టర్ కావడంతో ఏమి చేయాలో పాలు పోనీ పరిస్థితి నెలకొంది సైరా టీం కి. ఒక్క తెలుగు రాష్ట్రాలలో తప్పిస్తే ఈ సినిమా ఇక ఎక్కడా కూడా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాలలో సైతం దసరా సెలవులు కొనసాగించడంతో అక్కడక్కడా ఓ మోస్తరు కలెక్షన్ లు వస్తున్నాయి. తొలి రోజు మాత్రం అభిమానులు చూడడంతో పాటు, భారీ హైప్ క్రియేట్ చేశారు గనుక 53 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. రెండు వారాలు ముగిసినా ఈ సినిమాకి ఇప్పటిదాకా చిరంజీవి ఇమేజీకి తగ్గట్లు కలెక్షన్ లు రావడం లేదు.

సైరా సూపర్ హిట్ అని డబ్బా కొట్టుకుంటూ కొందరు ప్రచారం చేసుకుంటున్నా.. వారికి నిదానంగా గానీ, అసలు విషయం అర్ధం కాలేదు. ఇప్పటికే ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఎక్కువ చోట్ల ఎత్తేసారు కూడా. సినిమా విడుదల అయి రెండు వారాలు అవుతున్నా.. ఇంకా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో 91 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది. ఇక లాంగ్ రన్ లోకూడా 150 కోట్ల కి మించి వసూళ్లు చేసేలా కనిపించడం లేదు. ఇక హిందీ తో పాటు మిగిలిన భాషల్లోని బయ్యర్ల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. పెట్టిన డబ్బులతో కనీసం 20 శాతం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనితో బయ్యర్లు నిర్మాత రామ్‌ చరణ్‌ పై పడుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడికే వారు రామ్ చరణ్ ని కలవడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి అది మర్యాద పూర్వకంగా ఉంటుందో.. లేక తమ డబ్బులు ఇచ్చేయాలని ఆందోళన చేస్తారో త్వరలోనే తెలుస్తుంది.