రెండో రోజు భారీగా పడిపోయిన ‘సైరా నరసింహ రెడ్డి’ కలెక్షన్ లు

0
2984

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహ రెడ్డి’ మొదటి రోజు కలెక్షన్ ల కన్నా.. రెండో రోజు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దీనితో అభిమానుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఈ చిత్రం 53 కోట్ల షేర్ దాకా సాధించినా.. ఆ తరువాత కలక్షన్ లు భారీగా తగ్గడంతో చిత్ర టీమ్ ఆందోళన చెందుతుంది. రెండో రోజు ఈ చిత్రం కేవలం 15 కోట్లు మాత్రమే సాధించింది. దీంతో ఒక్కరోజులో 28 కోట్ల కలెక్షన్ లు తగ్గడంతో అటు మెగా కాంపౌండ్ తో పాటు.. ఇటు అభిమానుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. మొదటి రోజు గాంధీ జయంతి సెలవు దినం కావడంతో కలెక్షన్ లు బాగానే వచ్చినా.. రెండో రోజు సెలవు లేకపోడంతో కలెక్షన్ లలో భారీ తేడా కనిపిస్తుంది.

ఇక మూడో రోజు శుక్రవారం కావడంతో పెద్దగా వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు. శనివారం, ఆదివారం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది చిత్ర టీం. అయితే.. ఇప్పటికే పైరసీ పెద్ద ఎత్తున సోషల్ మీడియా కి చేరడంతో కలెక్షన్ లు ఎంతవరకు వస్తాయనేది ప్రశ్నగానే ఉంది. 270 కోట్లు బడ్జెట్ కావడంతో.. అసలు అంత వసూళ్లు చేయడం సాధ్యమైన పనేనా? అని అనుమానాలు వస్తున్నాయి. అయితే.. ఇప్పటికే సినిమా పెద్ద హిట్ అని ప్రమోషన్ లు చేసుకుంటుంది చిత్ర టీమ్. కానీ వాస్తవికంగా సినిమాలో అంత దమ్ము కనిపించక పోవడంతో.. ఎదో వెలితిగా ఉందని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. నిడివి ఎక్కువ కావడం, కథ లో బలం లేకపోవడం సినిమాకు నెగిటివ్ టాక్ ని తెచ్చిపెట్టాయి. దీనితో రాబోవు రెండు రోజుల్లోనైనా.. కలెక్షన్ లు వస్తాయనేది అనుమానం గానే ఉంది.