భారీ నష్టాలలో ‘సైరా నరసింహా రెడ్డి’.. కారణం అదేనా?

0
7993

రామ్ చరణ్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. విడుదలకు ముందు ఎన్నో అంచనాలు, అభిమానుల్లో ఎన్నో ఆశలు కలిగించిన ఈ చిత్రం.. విడుదల తరువాత మాత్రం డీలా పడేలా కనిపిస్తుంది. తొలుత గాంధీ జయంతి రోజున సెలవు రోజు కావడంతో.. ఈ చిత్రం భారీగానే వసూళ్లు సాధించింది. అయితే ఆ తరువాత సెలవు లేకపోవడంతో కలెక్షన్ లపై భారీ ప్రభావం చూపించింది. తొలి రోజు ఈ చిత్రం 53 కోట్ల షేర్ దాకా సాధించినా.. ఆ తరువాత కలక్షన్ లు భారీగా తగ్గడంతో చిత్ర టీమ్ ఆందోళన చెందుతుంది. రెండో రోజు ఈ చిత్రం కేవలం 15 కోట్లు మాత్రమే సాధించింది. ఇక శుక్రవారం మరింత తగ్గి కేవలం 9 కోట్లు మాత్రమే వసూళ్లు చేయడం ఆందోళన కలిగిస్తుంది.

అంటే ఈ చిత్రం మూడు రోజులకు కలిపి 77 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక శని ఆదివారాలు సెలవు రోజులు, ఆ తరువాత దసరా సెలవులు వస్తుండడంతో కలెక్షన్ లు పెరుగుతాయనే ఆశలు పెట్టుకుంది చిత్ర టీమ్. అయితే.. తెలుగు రాష్ట్రాలలో చూడాల్సిన అభిమానులు ఇప్పటికే చూసేసారు. అసలు చిరంజీవి చిత్రం అంటే.. మాములుగా సెలవుతో పని లేకుండా కలెక్షన్ లు సాదించాలి. మరి సైరా మాత్రం కలెక్షన్ ల ముందు బొక్క బోర్లా పడింది. అసలు ఈ చిత్రం చూడడానికి హిందీ తో సహా ఇతర భాషా ప్రేక్షకులు ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి హిందీ ప్రేక్షకులు 150 కోట్ల దాకా కలెక్షన్ లు సాధించి పెట్టారు. మరి సైరాకు హిందీలో మొత్తంగా కలిపినా కనీసం 10 కోట్లు కలెక్షన్ లు వచ్చేది కూడా కష్టంగా మారింది.

హిందీలో చిరంజీవికి మార్కెట్ లేకపోవడం ఒక కారణం అయితే.. అమితాబ్ ని చూసి కూడా సినిమాకు ఎవ్వరూ రాకపోవడం గమనార్హం. తొలుత అభిమానులు ఈ చిత్రం చూసి బాగుందని చెప్పినా.. సినిమాలో బాహుబలిలా దమ్ము లేదని, కథలో లో బలం తగ్గడంతో సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చింది. దీనితో ఇప్పుడు సెలవు రోజుల్లో కూడా కలెక్షన్ రాకపోతే.. ఈ చిత్రం భారీ నష్టాలలో కూరుకు పోవడం ఖాయంగా కనిపిస్తుంది.