‘సాహో’కి వచ్చిన కలెక్షన్ లలో సగం కూడా డౌటే..!

0
2694

గాంధీ జయంతి రోజున విడుదల అయిన ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రానికి తొలి రోజు మంచి వసూళ్లే వచ్చినా.. ఆ తరువాత కలెక్షన్ ల పరంగా పెద్ద దెబ్బే పడింది. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. సాహో తరహాలో ఈ సినిమాకి కూడా దేశవ్యాప్తంగా ప్రమోషన్ లు చేసారు కానీ.. కేవలం ప్రమోషన్ ల ధ్వారానే కాసులు రాలతాయని అనుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదు. అది కూడా చిరంజీవి కి తెలుగులో తప్ప.. మిగిలిన భాషల్లో లేదు. పైగా ఆయన వయసు కూడా పెద్ద మైనస్ గా మారింది. అలానే.. ఈ సినిమాకి ఇతర భాషల నుండి భారీగా నటీ నటులు నటించారు. అయితే.. అవన్నీ కూడా కథలో సుదీర్ఘంగా ఉండిపోయే పాత్రలు కాదు కాబట్టి.. ఆ నటుల ఫాన్స్ కి సరిగ్గా కనెక్ట్ కాలేకపోయింది.

ఒకరిద్దరు మినహా అందరూ కూడా తక్కువ నిడివి గల పాత్రలే చేశారు. ఇకపోతే చిరంజీవి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందినా కూడా.. ఆయన సినిమాలు ఎగబడి చూడడానికి నార్త్ ప్రేక్షకులు ఆసక్తి అస్సలు చూపించరు. బాహుబలి తరహాలో హిందీ వాళ్ళను ఆకట్టుకోవడానికి ఇది ఫాంటసీ సినిమా కూడా కాదు. అంతే కాక ఇప్పటికే దేశభక్తికి సంబందించిన సినిమాలు కోకొల్లలు వచ్చాయి. సినిమా నిడివి మరీ ఎక్కువగా ఉండడం.. డైలాగులు సగటు ప్రేక్షకుడికి అర్ధం కాకపోవడం.. లాజిక్ లేని ఫైట్ లు మొత్తంగా మెగాస్టార్ లెవెల్ ని కుదిస్తున్నాయి. ప్రీ రిలీజ్ లో అదిరిపోయిన.. కలెక్షన్ ల విషయంలో మాత్రం ఢీలా పడింది. ఇక శనివారం సెలవు రోజు కూడా కేవలం 7 కోట్లు మాత్రమే సాధించడంతో.. ఇక లాంగ్ రన్ లో కనీసం సాహో చిత్రానికి వచ్చిన కలెక్షన్ లలో సగం కూడా వచ్చేది అనుమానంగానే ఉంది.