కలెక్షన్ లు లేక అల్లాడుతున్న సైరాకి మరో షాక్.. దెబ్బమీద దెబ్బ

0
5150

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి చిత్రానికి ఇప్పటికే దేశ వ్యాప్తంగా కలెక్షన్ లు లేక డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 270 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి తొలి రోజు 53 కోట్లు సాధించినా.. ఇప్పటి దాకా 100 కోట్ల షేర్ కూడా రాకపోవడంతో చిత్ర టీం ఆందోళనలో ఉంది. శని, ఆది వారాలపై నమ్మకం పెట్టుకున్న చిత్ర టీం కి షాక్ ఎదురైంది. ఈ రెండు రోజుల్లో కూడా నామ మాత్రపు కలెక్షన్ లు మాత్రమే వచ్చాయి. ఈ రెండు రోజులకు కలిపి 19 కోట్ల వరకు మాత్రమే వచ్చాయని తెలుస్తుంది. హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రంలో సుదీప్ పాత్ర నిడివి కాస్త ఎక్కువ ఉండడంతో కన్నడలో ఓ మోస్తరుగా కలెక్షన్ లు వస్తున్నాయి. ఇక దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి.. రెండు, మూడు రోజులు ఓ మోస్తరు కలెక్షన్ లు వచ్చే అవకాశం ఉంది. సెలవులు ఉన్న కూడా తెలుగు రాష్ట్రాలలో రోజుకు 7 కోట్లు మాత్రమే వసూళ్లు వస్తున్నాయి. ఇక సెలవులు ముగిస్తే.. అవి కూడా దారుణంగా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే కలెక్షన్ లు రాక అల్లాడుతున్న సైరాకి చాణక్య రూపంలో మరో షాక్ తగిలింది. సైరా టైం లో గోపీచంద్ హీరోగా నటించిన ‘చాణక్య’ విడుదల అవుతుండడంతో.. అందరూ పెదవి విరిచారు. సైరా సునామీలో చాణక్య కొట్టుకుపోతుంది భావించారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఓ పక్క డిజాస్టర్ టాక్ తో కలెక్షన్ లు లేక అల్లాడుతున్న సైరా.. మరో పక్క సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతున్న చాణిక్య. గోపీచంద్ కి చిరంజీవి అంత ఇమేజ్ లేకున్నా.. ప్రేక్షకుడికి సినిమా బాగుండడం ముఖ్యం. అదే చాణిక్య విషయంలో జరిగింది. భారత్, పాకిస్థాన్ ల మధ్య జరుగుతున్న ప్రస్తుత సన్నివేశాలను అద్భుతంగా చూపించిండం, ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో లో గోపీచంద్ అద్భుత నటనతో పాటు, సునీల్, ఆలీ లు చేసిన కామెడీ సినిమాకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీనితో సైరా సునామీలో ‘చాణక్య’ కొట్టుకు పోవడం ఖాయం అనుకోగా.. ఇప్పుడు మాత్రం చాణక్య సూపర్ హిట్ టాక్ తో ‘సైరా’ కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది.