అప్పుడే 100 కోట్లు వసూళ్లు చేసిన ‘సైరా నరసింహారెడ్డి’

0
604

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. తన కొడుకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేస్తుంది. విడుదలకు ముందే 100 కోట్లు వసూళ్లు చేయడం విశేషం. అదెలా అంటే.. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతూ ఉండగా.. ఈ సినిమా వచ్చేనెల 2 విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ టాలీవుడ్ లో ఒక కొత్త రికార్డు ని సృష్టిస్తుంది.

సైరా నరసింహారెడ్డి డిజిటల్‌ హక్కులు 40 కోట్లకు అమ్ముడు అయినట్లు వార్తలు వస్తుండగా.. తెలుగుతో పాటు ఇతర భాషల శాటిలైట్‌ రైట్స్ అన్ని కలిపి 70 కోట్లకు పైగా అమ్ముడు పోయాయట. అంటే.. ఏ రకంగా చూసినా ఒక్క డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్ తోనే ఈ చిత్రం 100 కోట్లకు పైగా బిజినెస్‌ చేసినట్లే. దీనితో పాటు విడుదలకు ముందు థియెట్రికల్‌ బిజినెస్‌ కూడా భారీ స్థాయిలో జరుగుతుండటంతో ‘సైరా నరసింహారెడ్డి’ భారీ లాభాల పట్టనుంది. దీనితో నిర్మాతలకు పంట పండనుంది. రాంచరణ్ ఈ సినిమాకు ఏ మాత్రం ఖర్చుకు వెనుక ఆడకుండా 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాడు. అయితే ఇప్పుడు విడుదలకు ముందే 100 కోట్లు వసూళ్లు చేయడంతో.. విడుదల తరువాత ఈ సినిమా చేయబోయే వసూళ్లపై ఆసక్తి నెలకొంది.