‘సైరా నరసింహారెడ్డి’ మొదటి రోజు కలెక్షన్ లు.. అభిమానుల్లో నిరాశ

0
3175

ఎన్నో అంచనాలతో గాంధీ జయంతి రోజున విడుదల అయిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం మొదటి రోజు మిక్సడ్ టాక్ ని తెచ్చుకుంది. మొదటి రోజు ఎక్కువగా అభిమానులు చూస్తారు గనుక వాళ్ళందరూ మీదకి ముందుకి వచ్చి.. బాగుందని చెప్పడం సర్వ సాధారణం. అయితే.. గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం సినిమా ఆశించిన స్థాయిలో లేదని తెలుస్తుంది. అభిమానుల్లోనే కొంత నిరాశ నెలకొన్నట్లు తెలుస్తుంది. అలానే తెలుగు తో పాటు మరి కొన్ని భాషల్లో విడుదల అయిన ఈ చిత్రం అక్కడ కూడా ఆశించిన స్థాయిలో సినిమా లేదని వార్తలు వస్తున్నాయి. ఇక నేషనల్ మీడియా లో కూడా ఈ సినిమా పై అసంతృప్తి వ్యక్త పరిచింది. సినిమాలో ఎక్కువ శాతం సీన్లు బోర్ కొడతాయని.. సినిమా మామూలుగానే ఉందని నేషనల్ మీడియా సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.

2 గంటల 47 నిమిషాల నిడివిలో సినిమాలో ఏమి జరుగుతుందో ముందే చెప్పేయవచ్చని.. నిడివి కూడా ఎక్కువ కావడంతో బోరు కొడుతుందని నేషనల్ మీడియా తెలిపింది. అసలు అనుష్క పాత్ర ఎందుకు వచ్చిందో అర్ధం కాదని.. అనుష్క ని బలవంతంగా తీసుకొచ్చినట్లు ఉందని నేషనల్ మీడియా సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. సైరా నరసింహారెడ్డి ని పొగడడమే ఎక్కువగా ఉందని.. సైరా నరసింహారెడ్డి ని కేవలం పొగడడం కోసమే అనుష్క ని తీసుకొచ్చినట్లు ఉందని చెబుతన్నారు.

అయితే సినిమాపై ఇలా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. చిరంజీవి సీనియర్ నటుడు కావడంతో కలెక్షన్ లకు ఏమాత్రం ఢోకా లేదు. హిందీలో 5 కోట్లు వసూళ్లు తో కలిపి.. దేశ వ్యాప్తంగా 45 కోట్లను వసూళ్లు రాబట్టగా.. ఓవర్ సీస్ లో 10 కోట్లు సాధించినట్లు తెలుస్తుంది. దీనితో మొదటి రోజు ఈ చిత్ర షేర్ దాదాపు 55 కోట్ల దాకా వసూళ్లు చేసినట్లు తెలుస్తుంది.