సైరా ఇక క్లోజ్.. నిండా మునిగారా? సగం మునిగారా?

0
3513

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రం గత బుధవారం విడుదల అయిన తరువాత కలెక్షన్ లు లేక అల్లాడిపోతోంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేయడంతో ఈ సినిమా పై భారీ ఎఫెక్ట్ చూపించింది. ఒక్క తెలుగు రాష్ట్రాలలో తప్పిస్తే ఈ సినిమా ఇక ఎక్కడా కూడా కనిపించడం లేదు. కలెక్షన్ లు లేక ఈ సినిమాని ఎత్తేసారు కూడా. తొలి వారం కాకుండానే ఈ సినిమా ఎత్తేసారంటే.. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అని చెప్పక తప్పదు. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా నామమాత్రపు వసూళ్లు మాత్రమే వసూళ్లు చేసింది. తొలి రోజు మాత్రం అభిమానులు చూడడంతో పాటు, భారీ హైప్ క్రియేట్ చేశారు గనుక 53 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. ఇక అదే సైరాకి పండగ. రెండో రోజు నుండి కలెక్షన్ లు దారుణంగా పడిపోయాయి.

దసరా సెలవులు ఉన్నా కూడా ఈ సినిమా చూడడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించక పోవడం గమనార్హం. తొలి వారం ముగిసినా ఈ సినిమాకి ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాలలో 83 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాకి ఇప్పటిదాకా ఇంకా 120 కోట్లు కూడా రాలేదని సమాచారం. 270 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి తీసిన ఈ చిత్రానికి తొలివారం ముగిసినా ఇంత తక్కువ కలెక్షన్ లు మాత్రమే రావడంతో.. ఇక ఈ సినిమా కథ ముగిసినట్లే అని భావిస్తున్నారు. దసరా సెలవులు కూడా ముగియడంతో ఇక భారీగా కలెక్షన్ లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక లాంగ్ రన్ లోకూడా 150 కోట్ల కి మించి వసూళ్లు చేసేలా కనిపించడం లేదు. మరి దీనితో సైరా నష్టాలు మిగల్చనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. అది ఇంత మేరకు అనేది మరో వారం ఆగితే స్పష్టం అవుతుంది.