ప్లాప్ సినిమాకు హిట్ అని డప్పు కొట్టడం ఎందుకో?

0
8192

ఏదైనా సినిమా సినిమా ప్లాప్ అయితే ప్లాప్ అని చెబుతారు. హిట్ అయితే హిట్ అని చెబుతారు. కానీ.. కొందరు మాత్రం తన అభిమాన హీరో సినిమా ప్లాప్ అయినా.. హిట్ అయిందని దబాయిస్తారు. అలాంటి కోవలోకే వస్తుందేమో తాజాగా విడుదల అయిన ‘సైరా నరసింహ రెడ్డి’. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజున అభిమానులు ఎలాగూ హిట్ అని చెప్పడం సర్వ సాధారణం. అలాగే మెగా కాంపౌండ్ ని అభిమానించే కొన్ని చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు, కొన్ని వెబ్ సైట్ లు కూడా ‘అబ్బో అదరహో’ అని డప్పు కొట్టాయి. తొలి రోజు అభిమానాలు సినిమాకు ఎక్కువగా రావడంతో.. చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు ఫస్ట్ డే కలెక్షన్ లు బాగానే వచ్చాయి.

అయితే.. సినిమాలో దమ్ము లేకపోవడం, ఎక్కువగా కత్తులు, ఫైట్ లు ఉండడం తో సినిమా ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చలేదు. తెలుగులో మెగా కాంపౌండ్ ని అభిమానించే కొన్ని చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు, కొన్ని వెబ్ సైట్ లు తప్ప సినిమాకు దేశ వ్యాప్తంగా ఎక్కడా కూడా పాజిటివ్ టాక్ లేదు. అసలు బాలీవుడ్ లో ఈ సినిమాని చూడడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. బాలీవుడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్ర టీం కు ఈ విషయం మింగుడు పడడం లేదు. ఒక్క బాలీవుడ్ లోనే కాదు.. ఇతర తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా ఈ చిత్ర్రం నెగిటివ్ టాక్ సంపాదించింది.

ఈ సినిమా విడుదల అయిన రెండో రోజే.. బాలీవుడ్ లో మరీ దారుణంగా కలెక్షన్ లు లక్షలలోకి పడిపోవడం విశేషం. ప్రభాస్ కత్తి పట్టి యుద్ధం చేయడం చూసిన బాలీవుడ్ జనాలు.. అదే కళ్ళతో వయసు మీద పడిన చిరంజీవి కత్తి పడితే చూడలేక పోతున్నారట. ఇప్పటికే బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా డిజాస్టర్ టాక్ వచ్చినా.. ఒక్క టాలీవుడ్ లో మాత్రం మెగా కాంపౌండ్ ని అభిమానించే కొన్ని చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు, కొన్ని వెబ్ సైట్ లు ‘అబ్బో అదరహో’ అని డప్పు కొట్టడం ఎందుకో?

ఇక పోతే సైరా తరువాత గోపీచంద్ హీరోగా వచ్చిన ‘చాణిక్య’ విడుదల ని ఎవ్వరూ పట్టించుకోకపోయినా.. ఇప్పుడు ‘చాణిక్య’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం కూడా ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్ర కలెక్షన్ లపై భారీగానే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.