వద్దు వద్దని దిల్ రాజు మొత్తుకున్నాడట.. అయినా వినలేదట..!

0
8645

ఒకవైపు 270 కోట్ల దాకా భారీ బడ్జెట్ పెట్టారు. మరో వైపు ఒక్క తెలుగు రాష్ట్రాన్నే నమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి. దీనితో ఏమి చేయాలి. ఆ భారాన్ని తెలుగు ప్రజలపైనే మోపాలని అనుకున్నారో ఏమో గానీ.. సైరా చిత్ర టీం టికెట్ రేట్లను పెంచి పడేసింది. కనీసం చూసిన వాళ్ళ దగ్గర నుండైనా బాగా డబ్బులు వసూళ్లు చేయవచ్చని ప్లాన్ వేశారు. అయితే.. ఇప్పుడు అదే ప్లాన్ సైరా టీం కి బెడిసి కొట్టింది. ఒకవైపు 270 కోట్ల దాకా పెట్టారని వార్తలు రాగా.. దానిని ఎలా పూడ్చుకోవాలో తెలియక విడుదలకు ముందు సైరా చిత్ర టీం టికెట్ రేట్లను పెంచి పడేసింది. ఉత్తర ఆంధ్రాలో మెగా అభిమానులు ఎక్కువగా ఉన్నారని.. అక్కడ నెల నుండి బాల్కనీ వరకు టికెట్ ధర రూ. 300 పెంచగా.. మిగిలిన చోట్ల రూ. 200 , రూ.150 ఇలా ఫిక్స్ చేశారు. ఈ మేరకు సైరా టీం కోర్ట్ నుండి ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు. ఇక మల్టీ ఫ్లెక్స్ లలో టికెట్ రేట్లు అయితే చుక్కలు కనిపిస్తాయి.

అయితే .. ఇలా టికెట్ ధరలు విపరీతంగా పెంచడం సరైన పద్ధతి కాదని సినీ ఇండస్ట్రీ లో ఎంతో అనుభవం ఉన్న నిర్మాత దిల్ రాజు చెప్పారట. ఇది రిస్క్ అని కూడా దిల్ రాజు సైరా టీం కి చెప్పారట. అయితే దిల్ రాజు ఎంత చెప్పినా.. అతడి మాట పట్టించుకోలేదట. ఇప్పుడు ఇదే సైరాకు పెద్ద దెబ్బ తగిలిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టికెట్ ధరలు విపరీతంగా పెంచడంతో సినిమాకు ఫ్యామిలీలు రావడం లేదని.. అందుకే మొదటి రోజు మినహా రెండో రోజు నుండి కలెక్షన్ లు బాగా తగ్గిపోయాయని భావిస్తున్నారు. ఒక ఫ్యామిలీ లో కనీసం నలుగురు ఉన్నా మల్టీ ఫ్లెక్స్ లో సినిమా చూడాలంటే.. భారీగా పెరిగిన టికెట్ ధర, పార్కింగ్, ఇంటర్ వెల్ లో స్నాక్స్.. ఇలా అన్ని ఖర్చులు కలిపితే తడిసి మోపిడ అవుతుంది. ఇది సగటు ప్రేక్షకుడికి మింగుడు పడక.. లోపల సినిమా చూడాలని ఉన్నా సినిమా చూడడానికి ఎవరూ కూడా ముందడుగు వేయడం లేదని ఇన్సైడ్ టాక్.