తొలి రోజే ఆన్ లైన్ లో సినిమా ప్రత్యక్షం.. షాక్ లో రామ్ చరణ్, చిరంజీవి

0
1094

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీసిన చిత్రం ‘సైరా నరసింహరెడ్డి’. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రివ్యూ పై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. తొలిరోజు అభిమానులు చూసి సినిమా బాగుందని చెప్పినా.. సినీ ప్రేక్షకులు మాత్రం భిన్నంగా తమ అభిప్రాయం వ్యక్తం చేసారు. సినిమా నిడివి ఎక్కువ అవడం.. ఎక్కువ భాగం బోర్ కొడుతుండడం వంటి అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే.. తొలి రోజు సెలవు దినం కావడంతో 55 కోట్ల వరకు షేర్ సాధించింది ఈ చిత్రం. అయితే.. ఇక నుండి కలెక్షన్ లు బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం.. సినిమాపై నెగిటివ్ టాక్ తో పాటు, తొలి రోజే ఆన్ లైన్ లో సినిమా ప్రత్యక్షం కావడం.

మెగా కాంపౌండ్ ని నిద్రలేకుండా చేస్తున్న ఈ వార్త ఇప్పుడు కలెక్షన్ లపై భారీ ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఇంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా తొలి రోజే ఆన్ లైన్ లో సినిమా ప్రత్యక్షం కావడంతో పాటు.. ఇప్పుడు ఈ లింక్ లన్ని పేస్ బుక్, వాట్స్ యాప్ లలో అందరూ షేర్ చేసుకుంటున్నారు. ఈ సంగతి నిర్మాత రామ్ చరణ్ దాకా వెళ్ళింది. దీనితో రామ్ చరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అంతే కాదు సినిమా పైరసి పై ఈ రోజు అధికారికంగా ఫిర్యాదు కూడా చేయనుంది. అటు అభిమానులు కూడా ఈ లింక్ లను మెగా కాంపౌండ్ క్రియేట్ చేసిన మెయిల్ కి పంపిస్తూ ఉన్నారు. వాటిని మెగా టీం డిలీట్ చేసినా.. తమిళ రాకర్స్ బృందం మాత్రం వివిధ సర్వర్ల నుంచి.. రకరకాల వెబ్ సైట్స్ నుంచి కొత్త లింక్స్ క్రియేట్ చేస్తున్నారు. దీనితో ఏమి చేయాలో తెలియక మెగా కాంపౌండ్ తల పట్టుకుంది.