‘లం.. కొడుకులు’ అని.. పచ్చి బూతు చిరంజీవి ఎలా తిడతాడు?

0
3578

సినిమా లలో బూతులు ఉండడం సహజమే. అయితే అవి చిన్న చిన్న సినిమాలలో ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే.. పెద్ద సినిమాలలో ఇలా ఉంటె చూసిన ప్రేక్షకుడు అసహనానికి లోను కావడం సహజం. ఇక చిరంజీవి సినిమా అంటే బూతులకు చోటు ఉండదు. కానీ సైరా నరసింహ రెడ్డి సినిమాలో మాత్రం చిరంజీవి వాడిన భాష ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. భారత దేశాన్ని దోచుకుంటున్న తెల్ల దొరలపై చిరంజీవి వాడిన భాషలో సగటు ప్రేక్షకుడు అసహనానికి గిరి అయ్యేలా ఉంది. అది కూడా అంత పచ్చి బూతు కావడం గమనార్హం. అన్నం పెట్టిన చేతులనే నరికే తెల్ల ‘లం.. కొడుకులకు’ అంటూ తెల్ల దొరలపై చిరంజీవి విరుచుకు పడతాడు.

ఇప్పుడు ఈ బూతు సర్వత్రా చర్చనీయాంశం అయింది. మరీ ఇంతలా దిగజారి చిరంజీవి మాట్లాడకుండా ఉండాల్సిందని ప్రేక్షకులు చెబుతున్నారు. తాము కుటుంబంతో సినిమాకి వస్తామని.. ఇలాంటి సమయాలలో అలాంటి భాష మాట్లాడడం తమకు ఇబ్బందిగా ఉంటుందని సగటు ప్రేక్షకుడు అభిప్రాయం పడుతున్నాడు. ఈ బూతు విషయంలో కొద్దిగా బీప్ చేసినా కూడా.. అందరికీ అర్ధం అయ్యేలానే ఉంది ఆ మాట. గతంలో పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి ఇలాంటి భాషనే మాట్లాడగా.. అప్పుడు శ్రీరెడ్డి పై మెగా కాంపౌండ్ విరుచుకు పడిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు సాక్షాత్తు చిరంజీవి లాంటి ఒక మెగాస్టార్ కూడా ఇలాంటి భాషను ఉపయోగించడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. బూతులు ఎవరిని తిట్టారు అనే విషయం పక్కన పెట్టినా.. మనకు అంటూ ఒక సంస్కారం ఉండాలి కదా మరి.