చిరంజీవి, రామ్ చరణ్ లపై చీటింగ్ కేసు నమోదు

0
1165

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లపై చీటింగ్ కేసు నమోదు అయింది. దీనితో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సైరా నరసింహ రెడ్డి సినిమాకు విడుదల కు అడ్డంకులు వస్తున్నాయి. ఆ వివరాలలోకి వెళితే.. సైరా నరసింహ రెడ్డి చిత్రానికి సంబందించిన కథ విషయంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు తమతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారని.. ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కి తమను మోసం చేసారని నరసింహారెడ్డి వంశీయులు ఆరోపిస్తున్నారు. అంతే కాదు నోటరీపై 22 మందితో సంతకాలు చేయించారని తెలిపారు.

సైరా నరసింహ రెడ్డి మార్కెట్ విలువలో 10 శాతం తమకు ఇస్తామని సినిమా మొదలు పెట్టేటప్పుడు మాట ఇచ్చారని.. అలా చూస్తే తమకు 50 కోట్లు రావాల్సి ఉందని చెబుతున్నారు. అయితే తమను మోసం చేస్తూ.. సినిమా అయిపోయిందని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ విషయంలో తమ ఆస్తులు, స్థలాలను వాడుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు న్యాయం జరగకపోతే సైరా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను అడ్డుకొని తీరతామని హెచ్చరించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని.. తాము చేసిన ఫిర్యాదుతో పాటు అన్ని ఆధారాలు సమర్పించామని తెలిపారు.