‘సైరా నరసింహ రెడ్డి’ ట్రైలర్ విడుదల.. అద్భుతం అంటున్న ఫాన్స్

0
1141

భారత దేశాన్ని ఆక్రమించిన ఇంగ్లీష్ వాళ్లపై యుద్ధం చేసిన నాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పాత్ర ఆధారంగా చేసుకొని ‘సైరా నరసింహ రెడ్డి’ అనే సినిమాని మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అక్టోబర్ 2 న విడుదల చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ ట్రైలర్ ని విడుదల చేసారు చిత్ర టీం. ఈ ట్రైలర్ లో ప్రధాన పాత్రలను అన్ని కవర్ చేస్తూ.. విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ..”స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తోన్న తిరుగుబాటు. నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్నా. నా దేశం వదిలి వెళ్లిపోండి. లేకపోతే యుద్ధమే’ అనే డైలాగ్ అభిమానులను అలరిస్తుంది.