రామ్ చరణ్ ని ‘రా’ అన్న తమన్నా.. షాక్ లో అభిమానులు

0
1516

సాధారణంగా హీరో, హీరోయిన్ ల మధ్య చనువు ఉంటూనే ఉంటుంది. అది ఒక్కోసారి ఎక్కువ అవుతూ కూడా ఉంటుంది. హిందీ సినిమాలో ఇది ఎక్కువగా ఉంటుండగా.. టాలీవుడ్ లో కూడా హీరో, హీరోయిన్ ల మధ్య చనువు ఎప్పుడూ ఉంటుంది. ఇక యువ జంట అయితే.. చెప్పాల్సిన పని లేదు. తాజాగా రామ్ చరణ్, తమన్నా ల మధ్య కూడా ఇలాంటి చనువు కనిపిస్తుంది. అది ఇంతదాకా అంటే.. ఏకంగా రామ్ చరణ్ ని ‘రా’ అనే దాకా. అవును .. నిజమే, రామ్ చరణ్ ని తమన్నా ‘రా’ అనేసింది. తాజాగా జరిగిన సైరా సక్సెస్ మీట్ లో ఇది పబ్లిక్ గా బయట పడడం విశేషం. హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ ఒక్కొక్కరి గురించి ప్రస్తావన తెచ్చింది.

చరణ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. “చరణ్ నువ్వు కో యాక్టర్ గా బెటర్ నా.. ప్రొడ్యూసర్ గా బెటర్ నా.. ఏం చెప్పాలి రా” అని అనేసింది. దీనితో అందరూ షాక్ కి గురి అయ్యారు. అక్కడే ఉన్న చిరంజీవి పేస్ ఎక్సప్రెషన్ లో మార్పు లేకపోయినా.. మిగిలిన వారు మాత్రం మూసి మూసి నవ్వులు నవ్వుకున్నారు. ఇక ఆ తరువాత రామ్ చరణ్ మాట్లాడుతూ.. తమన్నా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. తమన్నా అనకుండా తమన్నాని చూపించి ‘మా నయనతార’ అని అనేశాడు. దీనితో తమన్నా పట్టలేక నవ్వింది. ఆమె అలా ఎంత సేపటికీ నవ్వు ఆపక పోవడంతో, “నువ్వు నవ్వడం ఆపేస్తే.. మాట్లాడతా” అంటూ చరణ్ అన్నాడు. దీనితో ఇద్దరి మధ్య ఎంత చనువు ఉందొ అర్ధం చేసుకోవచ్చు. వీరి మధ్య చనువు చేసి సినీజనాలు, అభిమానులు షాక్ కి గురయ్యారు.