Tuesday, May 18, 2021

తాతకు తగ్గ మనవడు! అన్నప్రాశనలో కత్తి పట్టున్న పరిటాల శ్రీరామ్ కొడుకు




పరిటాల రవీంద్ర. తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలుగు రాజకీయాలలో అయన ఓ కీలక నేతగా ఎదిగారు. అలాగే ఫ్రాక్షన్ లీడర్ గా కూడా పేరు పడ్డారు. ఇదంతా గతించిపోయిన గతం. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. అందుకు కారణం పరిటాల రవి మనుమడు. పరిటాల శ్రీరామ్ కొడుకు కి ఇటీవల అన్నప్రాశన జరిగింది.

ఈ వేడుకకు బంధుమిత్ర సపరివారంతా తరలిరాగా.. రాప్తాడు కోలాహలంగా మారింది. అన్నప్రాశన వేడుకలో అన్ని రకాల వస్తువులు పెట్టగా .. ఏది ముట్టుకుంటాడో అని అంతా ఆత్రంగా చూస్తుంటే, పోయి పోయి అక్కడే ఉన్న కత్తి పట్టుకున్నాడు. ఇంకేముంది అది చూసి తండ్రి పరిటాల శ్రీరామ్ నవ్వుతూ తల పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.





Related Articles

Latest Articles